Big Stories

Haryana: బండారు దత్తాత్రేయ చేతిలో ఆ రాష్ట్ర ప్రభుత్వ భవితవ్యం.. ఉంటుందా.. కూలబోతుందా?

BJP Haryana govt in minority: ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తలిగింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అదేవిధంగా ప్రస్తుత ప్రార్లమెంటు ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు సోంబీర్ సాంగ్వాన్, ధరంపాల్ గోందర్, రణధీర్ గోలెన్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విషయాన్ని తెలిపారు.

- Advertisement -

‘హరియాణాలోని నాయబ్ సింగ్ సైనీ నేతృత్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మా మద్దతును ఉపసంహరించుకుంటున్నాం. రాష్ట్రంలోని రైతుల సమస్యలు, అదేవిధంగా ఇతర పలు కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కే మా మద్దతు ఉంటుంది’ అని వారు పేర్కొన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది.

- Advertisement -

కాగా, హరియాణా రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే, ఈ విషయమై హరియాణా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ మాట్లాడుతూ.. ఈ ముగ్గురు ఎమ్మెల్యు తమ మద్దతును ఉపసంహరించుకోవడం, ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రాష్ట్రంలోని నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది.. వెంటనే ఆయన రాజీనామా చేయాలన్నారు. ఆ వెంటనే హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అయితే, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రణధీర్ గోలెన్, ధరంపాల్ గోందర్, సోంబీర్ సాంగ్వాన్ తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఇప్పుడు హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బందుల్లో పడినట్లు అయ్యింది. లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న ఈ తరుణంలో ఈ పరిణాములు బీజేపీనికి షాక్ కు గురిచేశాయని, నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోవడంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొన్నదంటూ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఈ పరిస్థితులను అదిగమించేందుకు బీజేపీ ఏం చేయబోతుందో చూడాలంటూ వారు చర్చించుకుంటున్నారు.

కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నెగ్గేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, అదేవిధంగా కూటమిలోని పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తంగా నువ్వా నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించబోతున్నాం.. 400 సీట్లు పక్కా అంటూ పార్టీల నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దశలలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికలు ముగిసిన విషయం విధితమే.

Also Read: బీజేపీ మిమ్మల్ని ఎదగనివ్వదు: రాహుల్

ఈ క్రమంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది..? ఈ ఎఫెక్ట్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీపై పడే అవకాశం లేకపోలేదు.. ఈ ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకు బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది.. అదేవిధంగా దీనిపై ఎలా స్పందించబోతుందని, ఇటు కాంగ్రెస్ కు లబ్ధి చేకూరే అవకాశముందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరీ ఈ పరిణామంపై బీజేపీ ఎలా స్పందిస్తది అనేది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News