Voter ID Cards 15 Days| భారత ఎన్నికల సంఘం (ECI) ఒక కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డులు (EPIC) ఎన్నికల జాబితా అప్డేట్ తర్వాత 15 రోజుల్లో ఓటర్లకు చేరతాయి. ఓటర్లకు మరింత సౌలభ్యం, సమర్థమైన సేవలు, రియల్-టైమ్ ట్రాకింగ్‌ను అందించడానికి తీసుకున్న చర్య. గతంలో ఓటర్ కార్డు చేరడానికి నెల రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేది. ఈ కొత్త విధానం ఓటర్లకు సులభంగా, త్వరగా కార్డు అందేలా చేస్తుంది.
ఓటరు కార్డు ట్రాకింగ్ ఎలా పనిచేస్తుంది?
- రియల్-టైమ్ ట్రాకింగ్: కార్డు తయారీ నుంచి డెలివరీ వరకు ప్రతి దశను ట్రాక్ చేయొచ్చు. ఓటర్లకు కార్డు స్టేటస్ గురించి సమాచారం ప్రతి దశలో అందుతుంది.
- SMS నోటిఫికేషన్స్: ప్రతి దశలో ఓటర్లకు SMS ద్వారా సమాచారం పంపిస్తారు. ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ సేవలను ప్రారంభించారు
- ప్రత్యేక IT మాడ్యూల్: ECI ఒక కొత్త IT మాడ్యూల్‌ను ECINet ప్లాట్‌ఫామ్‌లో ప్రవేశపెట్టింది. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ APIతో అనుసంధానమై, డెలివరీని సులభతరం చేస్తుంది.
- వర్క్‌ఫ్లో సులభతరం : పాత విధానాన్ని మార్చి, కొత్త సిస్టమ్ సేవలను మెరుగుపరుస్తూ, డేటా భద్రతను కాపాడుతుంది.
ఓటరు కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
ఓటరు కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం సులభం. ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.
- ఎన్‌విఎస్‌పి (NVSP) పోర్టల్ కు వెళ్లండి: నేషనల్ వోటర్స్ సర్వీస్ పోర్టల్ (NVSP) వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- సైన్ అప్ చేయండి: పైన రైట్ కార్నర్‌లో ఉన్న “సైన్-అప్” బటన్‌ను క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ID, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
- ఖాతా సృష్టించండి: మీ పేరు, పాస్‌వర్డ్, కన్ఫర్మ్ పాస్‌వర్డ్ నమోదు చేసి, OTP కోసం అభ్యర్థించండి.
- OTP ధృవీకరణ: మీ మొబైల్, ఈమెయిల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి ఖాతాను ధృవీకరించండి.
- లాగిన్ చేయండి: మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వండి.
- ఫారమ్ 6 పూరించండి: కొత్త ఓటరు నమోదు కోసం “ఫారమ్ 6” క్లిక్ చేసి, వ్యక్తిగత, కుటుంబ, సంప్రదింపు, చిరునామా వివరాలను నమోదు చేయండి.
- డాక్యుమెంట్లు అప్‌లోడ్: అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, దరఖాస్తును పరిశీలించండి.
- దరఖాస్తు సమర్పించండి: వివరాలు సరిచూసుకుని దరఖాస్తును సమర్పించండి.
ఓటరు కార్డు దరఖాస్తు స్టేటస్‌ని ఎలా తెలుసుకోవాలి?
- NVSP పోర్టల్‌కు వెళ్లండి.
- మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వండి.
- ‘ట్రాక్ ఆప్లికేషన్ స్టేటస్’ విభాగానికి వెళ్లండి.
- ఫామ్ 6 లేదా 6A సమర్పించిన తర్వాత వచ్చిన రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయండి.
- మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, సబ్మిట్ చేసి స్థితిని తెలుసుకోండి.
Also Read: ఉద్యోగంలో చేరకుండానే లక్షల్లో నష్టపరిహారం.. ఉద్యోగి హక్కులని చెప్పిన కోర్టు
వేగవంతమైన ఈ కొత్త విధానం ఓటర్లకు సమయం ఆదా చేస్తూ, పారదర్శకతను పెంచుతుంది. మీ ఓటరు కార్డు సిద్ధమైందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.

Share