BigTV English

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రిన్ని సంచ‌ల‌నాలు.. ఆ ఇద్ద‌రి నంబ‌ర్లు ట్యాప్!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రిన్ని సంచ‌ల‌నాలు.. ఆ ఇద్ద‌రి నంబ‌ర్లు ట్యాప్!

Phone Taping:  బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్య‌వ‌హ‌రం రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పోలీసులకే ప‌రిమితం అయిన ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల‌కు సైతం నోటీసులు అందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యంలో లింగ‌య్య రెండు ఫోన్ నంబ‌ర్ల‌ను ట్యాప్ చేయించిన‌ట్టు అధికారులు గుర్తించారు.


Also read: సుల్తానాబాద్ జిల్లాలో చేత‌బ‌డి క‌ల‌క‌లం.. పంట‌పొలంలో మ‌నిషిబొమ్మ‌.. వెళ్లి చూడ‌గానే!

ఆ రెండు నంబ‌ర్ల‌ను అడిష‌న‌ల్ ఎస్పీ భుజంగ‌రావు, తిరుప‌త‌న్న ట్యాప్ చేసిన‌ట్టు తెలుస్తోంది. వీరు ప్ర‌స్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంద అనుచ‌రులు మ‌ద‌న్ రెడ్డి, రాజ్ కుమార్ ల ఫోన్ నంబ‌ర్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు నిర్దారించారు. మ‌ద‌న్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు ఎయిర్ టెల్ నుండి రిపోర్టు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎమ్మెల్యే లింగ‌య్య‌తో పాటూ వీరిద్ద‌రినీ నేడు విచార‌ణ‌కు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు చిరుమర్తి లింగయ్య వెళ్ల‌నున్నారు.


ఆయ‌న‌ను ఏసీపీ వెంకటగిరి విచారించ‌నున్నారు. విచార‌ణ త‌రవాత ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. అంతే కాకుండా ఈ కేసులో ఇంకా ఎవ‌రెవ‌రి పేర్లు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్న చ‌ర్చ మొద‌లైంది. అయితే ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ కుట్ర చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఏ ప్ర‌భుత్వ‌మైనా చేస్తుంద‌ని సాధార‌ణ విష‌య‌మ‌ని చెప్ప‌డం తెలిసిందే.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×