BigTV English

Sharmila vs Jagan: దమ్ముంటే అసెంబ్లీ రండి.. లేకుంటే రాజీనామా చేయ్యండి, జగన్‌కు షర్మిల సలహా

Sharmila vs Jagan: దమ్ముంటే అసెంబ్లీ రండి.. లేకుంటే రాజీనామా చేయ్యండి, జగన్‌కు షర్మిల సలహా

Sharmila vs Jagan: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. బడ్జెట్ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండటాన్ని వివిధ రాజకీయ పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చక్కటి సలహా ఇచ్చారు. దమ్ముంటే నేతలు అసెంబ్లీకి వెళ్లాలని, లేకుంటే శాసనసభా పక్షం మొత్తం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది ఏపీలో మాజీ సీఎం జగన్ పరిస్థితి అంటూ వైసీపీపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల గొంతుక వినిపించే అవకాశం వైసీపీకి ప్రజలిస్తే ప్రతిపక్షం ఇస్తేనే వస్తామనం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళాలని సూచన చేశారు. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలన్నారు. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయాలన్నారు. అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోవాలని సలహా ఇచ్చేశారు.


అసెంబ్లీ మీద అలగడానికి.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికోకాదు ప్రజలు మీరు ఓట్లేసిందని ప్రశ్నించారు షర్మిల. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదని, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందని ఎక్స్‌లో ప్రస్తావించారు. మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

ALSO READ: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా

అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమన్నారు ఏపీ పీసీసీ. 1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లకే పరిమితం అయ్యిందన్నారు. అయినా ఏ మాత్రం కుంగిపోలేదని, మీకు మాదిరిగా హోదా కావాలని మారం చేయలేదంటూ లోపాలను ఎత్తి చూపారు.

26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డామని, ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించిందన్నారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైనా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని ఏనాడూ అడగలేదని గుర్తు చేశారు.

హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి అగ్రనేతలు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని గుర్తు చేశారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారన్నారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని వివరించారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, మహిళలపై దాడులు కొనసాగుతున్నానని అన్నారు. ఓ వైపు ఇసుక మాఫియా, ఇంకోవైపు బెల్టు షాపుల దందాను అరికట్టలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదన్నారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×