E-Paper
Advertisement

కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా? ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, వెనుక ఏం జరిగింది?

కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా? ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, వెనుక ఏం జరిగింది?
Advertisement

Vijayawada: ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గడిచిన కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. వైసీపీతో ఆమె కలిసిపోతున్నట్లు రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె రియాక్ట్ అయ్యారు. తనపై వస్తున్న వార్తలను ఖండించారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకుని తెర వెనుక రాజకీయాలు చేయాల్సిన ఖర్మ వైఎస్ కూతురుగా నాకు లేదని కుండబద్దలు కొట్టేశారు. అసలు ఏం జరిగింది?

తనపై వస్తున్న వార్తలను ఖండించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల

తాను ఎవరినో కలిసినట్లుగా, ఏదో పార్టీలో చేరిపోతున్నట్లుగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న రకరకాల విశ్లేషణలు పూర్తిగా తప్పుడు కథనాలన్నారు. జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని తేల్చేశారు. గిట్టని వాళ్ళు, పస లేని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని నేను చివరిసారిగా నా కొడుకు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలో భేటీ అయ్యాయని తెలిపారు. మళ్లీ ఇప్పుడు నా కుమార్తె అంజిలి రెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే వెళ్లానన్నారు.

కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా?-షర్మిల

Advertisement

అన్ని రాజకీయ పార్టీల అధినేతలు నా కూతురు పెళ్లికి వచ్చి దీవించాలని ఆహ్వానించానని మనసులోని మాట బయటపెట్టారు. ఇందులో కొత్తేం లేదని, వింత అంత కన్నా ఏమీలేదన్నారు. కన్న కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేయాల్సిన ఖర్మ వైఎస్ఆర్ కూతురుగా  నాకు లేదన్నారు. శుభకార్యానికి-రాజకీయానికి లింకులు పెట్టి నా విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బిడ్డ వైఎస్ అంజిలి రెడ్డి-సోమల రఘురామ్ రెడ్డి పెళ్లి మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హృదయ పూర్వక ఆశీస్సులు అందించాలని కోరారు.

ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, ఏం జరిగింది?

గడిచిన రెండువారాలుగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ పేపర్లలో వైఎస్ షర్మిల గురించి రకరకాల వార్తలు షికార్లు చేశాయి. కూతురు వివాహం నేపథ్యంలో జగన్‌తో ఆస్తుల వివాదానికి ఆమె పుల్‌స్టాప్ పెట్టారని రాసుకొచ్చాయి. ఈ వ్యవహారాన్ని వైఎస్ విజయమ్మ దగ్గరుండి సెటిల్ చేశారని, తండ్రి చెప్పిన మాదిరిగా చెల్లికి రావాల్సినవన్నీ ఇస్తానని జగన్ ఓకే చెప్పారట. కాకపోతే ఎన్నికల ప్రచారంలో తన తరపు షర్మిల ప్రచారం చేయాలని జగన్ మెలిక పెట్టారన్నది దాని సారాంశం. అందుకోసం వైసీపీలోని కీలక పెద్దలు రంగంలోకి దిగారంటూ రకరకాలుగా వార్తలు రాసుకొచ్చారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఓ వర్గం ఈ వార్తలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా. ఈ నేపథ్యంలో జరుగుతున్న కట్టుకథలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.

Advertisement

ALSO READ: డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్

Related News

విజయవాడలో విషాదం.. వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ దుర్మరణం!

డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్

అధికారం ఉందని చల్లబడితే కుదరదు.. ఇక దిశానిర్దేశం నాదే!- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మా చేతులు కట్టేయకపోతే ఒక్కడూ వెనక్కి వెళ్లేవాడు కాదు.. వైసిపిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!

నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం.. పోలీసుల ఉద్యోగాల పేరిట లక్షల వసూలు

బలంగా ఢీ కొన్న లారీ-టిప్పర్, విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి..

విజయవాడ శాప్ ఆఫీస్ ఘటన.. చంద్రబాబు ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×