E-Paper
Advertisement

డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్

డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్
Advertisement

YS Jagan: డీఎస్సీ అక్రమాల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ పూర్తిగా దొరికిపోయారని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న స్కామ్‌లు, అవినీతిని తాము ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకనే భౌతిక దాడులకు తెగబడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ

Advertisement

డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ర్యాలీతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైందని జగన్ అన్నారు. ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని తాము గట్టిగా డిమాండ్ చేస్తుంటే ఓర్చుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు, లోకేష్‌లు రౌడీలను రంగంలోకి దించారని మండిపడ్డారు.

యువగళం కాదు.. అదొక రౌడీ దళం!

Advertisement

ఇది యువగళం టీం ఎంతమాత్రం కాదని.. ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపే ప్రతిచోటా విరుచుకుపడే ఒక రౌడీ దళమని జగన్ విమర్శించారు. కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు చేసిన బెదిరింపు వ్యాఖ్యలే ఈ దాడుల కుట్రకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ రౌడీ మూకలకు పోలీసు యంత్రాంగం కూడా కొమ్ముకాస్తోందని, వారి చేతిలోని లాఠీలు లాక్కుని మరీ రాళ్ల దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ముఠాలను చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: అధికారం ఉందని చల్లబడితే కుదరదు.. ఇక దిశానిర్దేశం నాదే!- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Tags

Related News

విజయవాడలో విషాదం.. వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ దుర్మరణం!

కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా? ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, వెనుక ఏం జరిగింది?

అధికారం ఉందని చల్లబడితే కుదరదు.. ఇక దిశానిర్దేశం నాదే!- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మా చేతులు కట్టేయకపోతే ఒక్కడూ వెనక్కి వెళ్లేవాడు కాదు.. వైసిపిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!

నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం.. పోలీసుల ఉద్యోగాల పేరిట లక్షల వసూలు

బలంగా ఢీ కొన్న లారీ-టిప్పర్, విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి..

విజయవాడ శాప్ ఆఫీస్ ఘటన.. చంద్రబాబు ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×