Amazon Sale 2026: పండుగ సీజన్ మొదలైందంటే చాలు.. ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల చూపంతా అమెజాన్ తీసుకొచ్చే భారీ సేల్స్‌పైనే ఉంటుంది. ముఖ్యంగా దీపావళికి ముందు వచ్చే ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కోసం చాలామంది ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా ఆ ఎదురుచూపులకు తెరదించుతూ.. అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుందని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన టీజర్లను కూడా విడుదల చేసింది. దీంతో పండుగ షాపింగ్‌కు ఇప్పటి నుంచే సిద్ధమయ్యే సమయం వచ్చేసింది. మీకు నచ్చిన వస్తువులను కార్ట్‌లో యాడ్ చేసుకుని, సేల్‌లో వచ్చే డీల్స్ కోసం రెడీగా ఉండొచ్చు.
ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్, హోమ్ అప్లయెన్సెస్ నుంచి నిత్యవసరాల వరకు ప్రతి దానిపై భారీ డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం పండగే అని చెప్పుకోవాలి. ఎస్బీఐ కార్డులు లేదా ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేసే వారికి నేరుగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక మనలో చాలామంది అమజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారు కదా.. ప్రైమ్ మెంబర్స్‌కు అదనంగా మరో 10 శాతం వరకు ఆదా చేసుకునే వెసులుబాటును అమెజాన్ కల్పిస్తోంది.
Also Read: iPhone 17 యూజర్లు ఈ రెండు సెట్టింగ్స్ మార్చితే.. ఆఫీస్ పని చిటికెలో అయిపోతుంది!
ఈసారి పండుగ షాపింగ్‌ను మరింత ఇంట్రెస్టింగ్ చేయడానికి అమెజాన్ రకరకాల డీల్స్ సెక్షన్లను తీసుకువస్తోంది. రాత్రి 8 గంటలకు ప్రత్యేక డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. పాత సామాన్లు మార్చుకుని కొత్తవి కొనేవారికి ఎక్స్ఛేంజ్ మేలా ద్వారా అదనపు బెనిఫిట్స్ వస్తాయి. వీటితో పాటు బై మోర్ సేవ్ మోర్, అమెజాన్ కాంబోస్, శాంపిల్ మానియా వంటి బోలెడన్ని ఆఫర్లు మనల్ని ఉంటాయి. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉండటంతో పెద్ద బడ్జెట్ సామాన్లు కొనడం మరింత ఈజీ అవుతుంది.
పండుగ రద్దీలో సామాన్లు టైమ్‌కు అందవనే టెన్షన్ లేకుండా అమెజాన్ ఈసారి తమ డెలివరీ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 20 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 6 సార్టింగ్ సెంటర్లు, 150 లాస్ట్‌మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు 60కి పైగా నగరాల్లో అందుబాటులో ఉన్న అమెజాన్ నౌ సర్వీసులను దీపావళి లోపు వంద నగరాలకు విస్తరించాలని చూస్తోంది. టూయర్ 2, టూయర్ 3 సిటీల వాళ్లకు కూడా అతి తక్కువ సమయంలోనే డెలివరీలు అందేలా ఏర్పాట్లు జరిగిపోయాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ విష్‌లిస్ట్‌ను ఇప్పుడే సిద్ధం చేసుకోండి.
Also Read: వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?