New Maruti Dzire CNG AMT: మంచి మైలేజీ కావాలి.. అదే సమయంలో ట్రాఫిక్‌లో క్లచ్‌ను పదేపదే నొక్కే ఇబ్బంది కూడా ఉండకూడదనుకునే వారికి మారుతి డిజైర్ కొత్త ఆప్షన్‌గా మారింది. డిజైర్ CNG AMT వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్ ఏకంగా 36.47 కి.మీ మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు CNG విభాగంలో అత్యధిక మైలేజీ అందించే సెడాన్లలో ఒకటిగా మారింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో డిజైర్ CNG AMT ఆన్‌రోడ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మారుతి డిజైర్ CNG ఆటోమేటిక్‌ను VXi, ZXi అనే రెండు వేరియంట్లలో అందిస్తోంది. సాధారణ CNG మాన్యువల్ మోడల్‌తో పోలిస్తే AMT కోసం సుమారు రూ.35,000 వరకు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. సిటీని బట్టి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు మారుతాయి. ఢిల్లీలో VXi CNG AMT ఆన్‌రోడ్ ధర సుమారు రూ.9.62 లక్షలు, ZXi ధర రూ.10.73 లక్షలుగా ఉంది. ముంబై, పుణెల్లో ఇవి దాదాపు రూ.9.58 లక్షలు, రూ.10.70 లక్షల వరకు ఉంటుంది. బెంగళూరులో VXi సుమారు రూ.10.50 లక్షలు, ZXi రూ.11.11 లక్షలు, హైదరాబాద్‌లో వరుసగా రూ.10.40 లక్షలు, రూ.11.60 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. చెన్నై, కోల్‌కతాల్లో కూడా ట్యాక్సులు, ఆర్టీఓ, ఇన్సూరెన్స్ ఛార్జీలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. డీలర్ దగ్గర తాజా ఆన్‌రోడ్ ధరను చెక్ చేయడం మంచిది.
డిజైర్ CNG AMT మైలేజీ 36.47 కి.మీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇదే కారు CNG మాన్యువల్ వెర్షన్ 33.73 కి.మీ/కేజీ మైలేజీని ఇస్తుందని తెలిపింది. డిజైర్ CNG AMT, సెలెరియో CNG, వాగన్ఆర్ CNG లాంటి మోడళ్ల క్లెయిమ్‌డ్ మైలేజీ కంటే ముందుంది. అయితే, వాస్తవ వినియోగంలో వచ్చే మైలేజీ ట్రాఫిక్ పరిస్థితులు, రోడ్డు, ఎయిర్ కండిషనింగ్ వినియోగం, డ్రైవింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
డిజైర్ CNG AMTలో 1.2 లీటర్, మూడు సిలిండర్ల Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ను ఉపయోగించారు. CNG మోడ్‌లో ఇది 68 bhp పవర్, 101 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ యాడ్ చేశారు. రోజూ ఆఫీస్ ప్రయాణాలు, రద్దీగా ఉండే నగర రోడ్లపై డ్రైవింగ్ చేసే వారికి మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పోలిస్తే AMT సౌకర్యంగా ఉంటుంది.
డిజైర్ CNG AMTలో కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. CNG సిలిండర్‌ను బూట్‌లో ఫిక్స్ చేయడం వల్ల సాధారణ డిజైర్‌తో పోలిస్తే లగేజ్ పెట్టుకునే స్థలం తగ్గుతుంది. ఎక్కువ బరువును మెయింటెన్ చేసేందుకు మారుతి సస్పెన్షన్‌లోనూ మార్పులు చేసింది. ఇదే విభాగంలోని టాటా టిగోర్ CNG AMT మాత్రం అండర్ ఫ్లోర్ ట్విన్ సిలిండర్ సెటప్‌ను ఉపయోగిస్తుంది. దీంతో బూట్ స్పేస్ కొంత ఎక్కువగా ఉంటుంది.
Read Also: త్వరలో 5 కొత్త CNG కార్ల ఎంట్రీ.. మైలేజీతో పాటు ఫీచర్లు కూడా అదుర్స్!