E-Paper
Advertisement

YS Sharmila : ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల.. ముహూర్తం ఫిక్స్..

YS Sharmila : ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల.. ముహూర్తం ఫిక్స్..
Advertisement

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్‌ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు బయల్దేరతారు. శనివారం సాయంత్రం 4 గంటలకు YSR ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఆదివారం కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు PCC చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారానికి ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్‌, మయప్పన్‌తో పాటు, సీనియర్‌ నాయకులు హాజరు కానున్నారు.

Advertisement

PCC చీఫ్‌ పదవితో షర్మిల యాక్టివ్‌ అవుతున్నారు. సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా గతంలో తన తండ్రి వైఎస్‌తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వైఎస్ మృతి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పలువురు నేతలతో ఫోన్లో చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా కలిసి మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ల సహకారం, సూచనలు ఎంతో అవసరమని భావిస్తున్న షర్మిల.. కడప జిల్లాలో సైలెంట్‌గా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నారు.

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×