
Pawan Kalyan Vs YCP Leaders(Today’s state news): వారాహి యాత్ర 2.0 ప్రారంభం కాబోతున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ మళ్లీ పెరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా వైసీపీ నేతలు మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఈ సారి ఎంపీ మిథన్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. వారాహి యాత్ర 1.0లో జనసేనాని వైసీపీ నేతలపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. టీడీపీతో పొత్తు కోసమే పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. సీఎంను కావడానికి కావాల్సిన బలం తనకు లేదని స్వయంగా పవన్ చెప్పారని గుర్తు చేశారు.
ప్రజలతో నేరుగా ఉన్న విషయాన్నే చెబుతామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలన్నదే వైసీపీ స్ట్రాటజీ అని తేల్చిచెప్పారు. అందుకే ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందామని భావిస్తేనే తమకు ఓటు వేయాలని సీఎం జగన్ అంటున్నారని తెలిపారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వనిస్తామన్నారు మిథున్ రెడ్డి. ముందస్తు ఎన్నికలపైనా క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్లిన నేతలకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కతాయని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ ను మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి టార్గెట్ చేశారు. వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయం అంటే ఓటీటీ వెబ్ సిరీస్ కాదన్నారు. పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ అని చురకలు అంటించారు. పవన్ సినిమాలో చంద్రబాబు విలన్ అని తెలిపారు.
175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు లేరని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబును భుజాన వేసుకొని తిరగడానికి తప్ప రాజకీయ పార్టీ దేనికి? ప్రశ్నించారు. 2019 ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పవన్ మూడో భార్యతో విడిపోయారని న్యూస్ వస్తే.. వెంటనే భుజాలు తడుముకొని ఫోటో విడుదల చేశారని విమర్శించారు.
జనసేనాని ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్ర చేపడుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు మరోసారి డైలాగ్స్ వార్ కు దిగారు. మరి పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి .