E-Paper
Advertisement

Komali Death: కోమలి సూసైడ్‌కి ముందు అసలు ఏం జరిగింది?.. ఆత్మహత్యకు కారణం ఇదేనా?

Komali Death: కోమలి సూసైడ్‌కి ముందు అసలు ఏం జరిగింది?.. ఆత్మహత్యకు కారణం ఇదేనా?
Advertisement

Komali Death: ప్రముఖ సోషల్ మీడియా వ్లాగర్, యూట్యూబర్ కోమలి (21) అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాయదుర్గంలోని తన నివాసంలో కోమలి బలవన్మరణానికి పాల్పడటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా వాదిస్తున్నారు. కోమలి మృతికి ఆమె మాజీ భాగస్వామి, మరో యూట్యూబర్ నిఖిల్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, అయితే ఏడాది క్రితమే వారు విడిపోయారని తెలుస్తోంది. అయినప్పటికీ, నిఖిల్ ఆమెను మానసిక వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also-Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తిలిస్తే బిత్తెర పోరారు!.. మరీ ఇంత దారుణమా?

Advertisement

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ కోమలి ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషాద ఘటనపై ఆమె తల్లి వరలక్ష్మి తాజాగా స్పందిస్తూ, తన కుమార్తె మరణానికి గల కారణాలను వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. అఖిల్ అనే వ్యక్తి తన కూతురిని మానసిక వేదనకు గురిచేసి, మోసం చేశాడని ఆమె ఆరోపించారు. కోమలి తన తల్లితో చివరిసారిగా ఆదివారం రాత్రి మాట్లాడింది. కువైట్‌లో ఉంటున్న తల్లికి ఫోన్ చేసిన కోమలి, తనకు కడుపునొప్పి తగ్గిందని, పెరుగన్నం తిన్నానని చెప్పిందని వరలక్ష్మి గుర్తు చేసుకున్నారు. “ఆఫీస్ పని ఉందని ఫోన్ పెట్టేసింది, అదే నా బిడ్డతో నేను మాట్లాడిన చివరి మాట అవుతుందని అనుకోలేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అఖిల్ తీరుపై ఆరోపణలు

కోమలికి అఖిల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో గత ఆరు నెలలుగా పరిచయం ఉందని, వారిద్దరూ ప్రేమించుకున్నారని తల్లి తెలిపారు. అయితే.. ఆరు నెలల క్రితమే అఖిల్‌ను పెళ్లి గురించి అడిగితే, తనకు ఇష్టం లేదని చెప్పి తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని వరలక్ష్మి పేర్కొన్నారు. అఖిల్ తన కూతురిని ఆర్థికంగా కూడా వాడుకున్నాడని, ఆమె దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. బయటకు తనకు సంబంధం లేదని చెబుతూనే, కోమలితో రహస్యంగా మాట్లాడుతూ ఆమెను మానసిక ఒత్తిడికి గురిచేశాడని తెలిపారు.

Advertisement

Read also-Rukmini Vasanth: సింపుల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న రుక్మిణీ వసంత్!

ఘటన జరిగిన రోజు ఏం జరిగింది?

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం, అఖిల్ శనివారం రాత్రి కోమలి నివాసానికి వచ్చి, ఆదివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వెళ్ళిపోయాడు. అదే రోజు మధ్యాహ్నం అఖిల్ సోదరి తమకు ఫోన్ చేసి, కోమలి వల్ల తమ తమ్ముడు ఇబ్బంది పడుతున్నాడని ఫిర్యాదు చేసినట్లు వరలక్ష్మి వెల్లడించారు. “నా కూతురు చాలా ధైర్యవంతురాలు. గతంలో ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు మందలిస్తే.. ‘నేను హీరోయిన్ అవుతానమ్మా, బాగా సెటిల్ అవుతాను’ అని ప్రామిస్ చేసింది. కానీ ఈ అఖిల్ నా బిడ్డను బతకనివ్వలేదు” అని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. తన కష్టార్జితంతో పిల్లలను పెంచానని, పెళ్లి చేయాల్సిన వయసులో కూతురిని పాడె మీద చూడటం ఏ తల్లికి రాకూడదని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×