MP Mithun Reddy: ఏపీలో రెడ్ బుక్ వ్యవహారం స్పీడందుకుందా? లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కష్టాలు తప్పవా? ఢిల్లీకి సీఐడీ ఎందుకు వెళ్లింది? మిథున్‌రెడ్డి బయటపడేందుకు జగన్ రంగంలోకి దిగేశారా? సుప్రీంకోర్టు లాయర్లతో మంతనాలు సాగిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం ఏం జరుగుతోంది?
వైసీపీలో టెన్షన్
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? రేపో మాపో వైసీపీ కీలక నేతలు అరెస్టు కావడం ఖాయమా? తాజాగా లిక్కర్ స్కామ్‌పై విచారణ చేస్తున్న సీఐడీ ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి కోసమే హస్తినకు వెళ్లినట్టు ఓ వార్తలు హంగామా చేస్తోంది. ఈ కేసులో మిథున్‌రెడ్డి పాత్రపై మొదటి నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి.
ఢిల్లీకి సీఐడీ
ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో సీఐడీ రంగంలోకి దిగేసింది. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని విచారణ చేసింది సీఐడీ. మాజీ ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి విచారణ సమయంలో మిథున్‌రెడ్డి గురించి కీలక విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేస్తారని భావించారు ఎంపీ మిథున్ రెడ్డి.
ఈ కేసులో తన పేరు చేర్చి అరెస్టు చేస్తారేమో అనే భయంతో హైకోర్టును ఎంపీ మిథున్ రెడ్డి ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆయా పిటిషన్లపై మార్చి 24న వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం, మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
ALSO READ: అన్నీ ఆయనే చేశారు.. రోజా-అంబటి, ఏంటిది?
సుప్రీంకోర్టులో సవాల్
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వెంటనే సుప్రీంకోర్టు గడప తొక్కారు ఎంపీ మిథున్‌రెడ్డి. ఆయన పిటిషన్ సోమవారం విచారణకు రానున్నట్టు సమాచారం. ఆలోపు అరెస్ట్ కాకుండా ఉండేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబరు 23న సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కీలక వ్యక్తులను విచారించింది.
ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి, ఆ మధ్య లిక్కర్ స్కామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఓపెన్‌గా చెప్పారు. దీనికి సంబందించి ఫ్యూచర్‌లో అవసరమైతే సమాచారం ఇస్తానని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో కసిరెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానం తోసిపుచ్చింది కూడా.
నోటీసులా? అరెస్టు ఖాయమా?
మరోవైపు లిక్కర్ కేసులో నేతలు అరెస్టు కాకుండా ఉండేందుకు జగన్ తెర వెనుక తన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా సుప్రీంకోర్టు అడ్వకేట్లతో ఆయన మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ ఎంపీని అరెస్టు చేస్తుందా? లేకుంటే కేవలం నోటీసులతో సరిపెడుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: నాగబాబు గో బ్యాక్… పిఠాపురంలో టీడీపీ రచ్చ