Jr NTR : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా త్రిబుల్ ఆర్. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి తెలిసి వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ విపరీతంగా చాలామందిని ఆకట్టుకున్నాయి. రాజమౌళి ఈ మల్టీస్టారర్ సినిమా చేయడం వలన ఇద్దరు హీరోల మధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసి వచ్చింది. ముఖ్యంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన ఇంటర్వ్యూస్ బాగా పాపులర్ అయ్యాయి. ఒకరకంగా సినిమా పబ్లిక్ లోకి వెళ్లడానికి అది మంచిగా ఉపయోగపడింది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఒకరిని ఒకరు గిల్లుకోవడం మనందరం చూసాం. ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా కొన్నిసార్లు స్పీచ్ ఇచ్చే టైంలో ఒకరిని ఒకరు గిల్లుతూ చాలా సరదాగా ఆన్ స్టేజ్ పై కనిపించేవాళ్ళు. కేవలం ఇంటర్వ్యూస్ లో మాత్రమే కాకుండా చాలాసార్లు సెట్స్ లో వీళ్ళిద్దరి మధ్య ఇదే జరుగుతుంది అని రాజమౌళి ఆన్ స్టేజ్ చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
మరోసారి ఎన్టీఆర్ అలా చేశాడు
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా లో పెద్దగా కథ ఏమీ లేకపోయినా కూడా కేవలం కామెడీ వలన 50 కోట్లకు పైగా ఇప్పటికే వసూలు చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో చాలామందికి అవార్డులు ప్రజెంట్ చేశారు. అలానే ఎన్టీఆర్ బావమరిది నర్నే నితిన్ కు ఎన్టీఆర్ అవార్డు ఇస్తున్న తరుణంలో గట్టిగా గిల్లాడు. ఒక్కసారిగా నితిన్ ఉలిక్కిపడ్డాడు. అలానే నితిన్ కళ్ళలో ఆ పెయిన్ కూడా కనిపించింది. కానీ ఏమీ ఎరగనట్టు ఎన్టీఆర్ చాలా సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారక్ ఇంకా ఆ చిలిపి పనులు మానలేదు అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేయడం మొదలు పెడుతున్నారు.
Also Read : Prithviraj Sukumaran : లూసిఫర్ 2 ఎఫెక్ట్… పృథ్విరాజ్‌కు ఐటీ నోటీసులు..?
ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు
ఎన్టీఆర్ ఈ సినిమా ఈవెంట్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవర 2 చిత్రంతోపాటు, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నట్లు తెలిపారు. అలానే నెల్సన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు ఆ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ వంశీ నిర్మించబోతున్నట్లు ఎన్నోసార్లు వార్తలు వినిపించాయి. దానిపైన కూడా తాజాగా స్పందించాడు. ఆ సినిమా జరిగిన రోజు ప్రొడ్యూసర్ గా వంశీ పేరు చూసిన రోజు మీ అభిమానులందరినీ చూసుకోమని నేను వంశీకి అప్ప చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా రెండు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసి మంచి లాభాలు పొందుకున్నాడు నాగ వంశీ. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు అందరిలో నాగవంశీ కొంచెం ప్రత్యేకమైన చెప్పాలి. వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నాడు.
Gillesadu 😂 pic.twitter.com/40xYGRMjZ8
— For The Cause 🎬 (@its_my_name_sai) April 4, 2025