BigTV English

YS Jagan: వైసీపీ కొత్త ప్రచారం.. ఏ క్షణమైనా బెయిల్ రద్దు, టెన్షన్‌లో జగన్ !

YS Jagan: వైసీపీ కొత్త ప్రచారం.. ఏ క్షణమైనా బెయిల్ రద్దు, టెన్షన్‌లో జగన్ !

YS Jagan: వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టేసిందా? ఆస్తుల వ్యవహారాన్ని తప్పించుకునేందుకు కొత్త పల్లవి ఎత్తుకుందా? ఆస్తుల వ్యవహారానికి – ఆయన బెయిల్‌ రద్దుకు ఎందుకు లింకుపెడుతోందా? జగన్‌కు బెయిల్ రద్దు అయ్యే అవకాశముందంటూ ఎందుకు ప్రచారం చేస్తోంది? జగన్‌కు అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


సింహం.. సింగిల్‌గా వస్తోందంటూ జగన్‌ను రెచ్చగొట్టారు.. ఆ పార్టీ నేతలు. నేతల ఆలోచనను అర్థం చేసుకోలేక పోయారు. నేతలంతా సైలెంట్ అయిపోయారు. అడ్డంగా బుక్కయ్యారు వైసీపీ అధినేత జగన్. సొంత వ్యవహారమేకాదు.. పార్టీ పరంగా మాట్లాడేందుకు ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదు. జగన్ వ్యవహారశైలి వల్లే దూరంగా ఉన్నామన్నది కొందరి నేతల మాట.

గతంలోకి వెళ్థాం… గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు న్యాయస్థానం ముందు హాజరుకాలేదు జగన్. కార్యక్రమాలున్నాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో కచ్చితం గా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మరోవైపు జగన్ ఆస్తుల కేసుల విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో సీబీఐ ఛార్జిషీటు ఎప్పుడో దాఖలు చేసింది. వాటిపై విచారణ జరిగితే తీర్పు వచ్చే అవకాశముంది. విచారణ డిలే అవుతోంది. న్యాయమూర్తులు మారిపోవడంతో మరింత ఆలస్యమవుతోందని అంటున్నారు.

ALSO READ:  వైఎస్ఆర్‌కు, నీకు సంబంధం లేదు: షర్మిల

ప్రస్తుతానికి వచ్చేద్దాం.. షర్మిల-జగన్ ఆస్తుల వ్యవహారంలో అధినేతకు ఏ క్షణమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశ ముందని ప్రచారం ఊదరగొడుతోంది. జగన్ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తికి షర్మిలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. కుటుంబం ఆస్తులను వైఎస్ఆర్ జీవించిన్నపుడే పంపకాలు చేసేశారని అంటోంది.

చెల్లి షర్మిలపై ప్రేమతో సంపాదించిన ఆస్తిలో కొంత ఇస్తున్నారంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టేసింది. తన సొంత ఆస్తి అయినప్పుడు జగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారంటూ ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. అధికార ప్రభుత్వం అండతో విజయమ్మను ముందుపెట్టి జగన్‌ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తున్నారన్నది అందులోని ప్రధాన పాయింట్.

గురువారం విజయనగరం వెళ్లిన జగన్, ఆస్తుల వ్యవహారాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలు అందరి ఇళ్లలో ఉన్నదేనంటూ ప్రజలకు కొత్త సందేశాన్ని ఇచ్చారు. మరి బెయిల్ రద్దు వ్యవహారం కూడా చాలా మంది ఇళ్లలో ఉన్నదేనని ఎందుకు తీసుకోలేపోతున్నారు? అన్నదే అసలు పాయింట్. మొత్తానికి జగన్ భయం వెనుక ఏదో సంకేతాలు ఉన్నాయనేది సుస్పష్టం.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×