BigTV English

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

War 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి .. కొత్త రికార్డును సృష్టించాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాల్లో వార్ 2 ఒకటి. ఆర్ఆర్ఆర్ తరువాత బాలీవుడ్ లో ఎన్టీఆర్ కు మంచి గుర్తింపునే దక్కింది. ఇక ఆ గుర్తింపును మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు తారక్. ఈ నేపథ్యంలోనే తారక్.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.


Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్  సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం వార్ 2.  బ్రహ్మస్త్ర సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొద్దిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది.


ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వార్ 2.. వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక దేవర ను ఫినిష్ చేసిన దగ్గరనుంచి ఎన్టీఆర్.. వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న విషయం విదితమే. తాజాగా వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ లుక్ లీక్ అయ్యాయి. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు ఎవరో కెమెరా నుంచి తీసిన ఫొటోస్ లా కనిపిస్తున్నాయి. బ్రౌన్ కలర్ టీ షర్ట్.. పైన ఆర్మీ షర్ట్ వేసుకొని.. నడుస్తూ కనిపించాడు. ఈ లుక్ లో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?

ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఎప్పటి నుంచో ఎన్టీఆర్.. బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ నుంచి  ఆ ప్రయత్నాలు  మొదలుపెట్టాడు. వార్ 2 కనుక హిట్ టాక్ తెచ్చుకుంది అంటే.. అసలు బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఆపడం ఎవరితరం కాదనే చెప్పాలి. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి. ఇక ఈ సినిమా కాకుండా ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ 31 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×