Ysrcp Roja: మాజీ మంత్రి రోజాను వైసీపీ పక్కనపెట్టిందా? కావాలనే ఆమె దూరంగా ఉంటున్నారా? ప్రస్తుతం నగరికి మాత్రమే పరిమితమయ్యారా? ఆమెను దూరంగా పెట్టాలని వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడమే కారణమా? తాను ఎక్కడున్నా ఫైర్‌బ్రాండ్ అని చేసే ప్రయత్నం చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ ఫైర్‌బ్రాండ్ అని చెప్పగానే ముందు వరుసలో ఉంటారు రోజా. ప్రత్యర్థులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారు. అదంతా గతం.. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు మారాయి. ఆ పార్టీ నేతలు సైతం ఎవరూ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. సైలెంట్ గా ఉండటానికే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరి నేతలకు కార్యకర్తలు ఫోన్ చేసినా ఔటాప్ సర్వీస్ వస్తుందని అంటున్నారు.
తాజాగా జూన్ నాలుగున వైసీపీ అధినేత జగన్ ‘వెన్నుపోటు’ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. దీంతో ఏడాది తర్వాత నేతలు తమ కేడర్‌తో తమ తమ నియోజకవర్గాల్లో బుధవారం రోడ్లపైకి వచ్చారు. కాకపోతే ఎవరూ ఎక్కడా ఫోకస్ కాలేదు. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు మాజీ మంత్రి రోజా.
నగరి పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు ‘వెన్నుపోటు దినం’ పేరిట నిరసన ర్యాలీ చేపట్టారు ఆ పార్టీ నేతలు. మాజీ మంత్రి రోజా అందులో పాల్గొన్నారు. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. ప్లకార్డులపై సూపర్ సిక్స్ లేదు.. హామీలు లేవు.. మేనిఫెస్టో మూలకి అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసనకు దిగారు.
ALSO READ: మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన బొత్స
అంతేకాకుండా వెరైటీ చెవితో పువ్వులు పెట్టుకున్నారు. రోజాతోపాటు వైసీపీ కేడర్ కూడా చెవిలో పువ్వులు పెట్టుకుని మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇన్నాళ్లు మేడం రోజా ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీని ఆమెని పక్కన పెట్టిందా? కేవలం తన నియోజకవర్గానికి పరిమితం చేసిందా? అంతర్గత విభేదాలే ఇందుకు కారణమా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు అవుతున్నాయి.
బలమైన వాయిస్ లేకుంటే పార్టీ ఆలోచన విధానం బయటకు ఎలా వెళ్తుందని అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత రోజా అయితే పువ్వు పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ మేరకు మీడియాలో హైలైట్ అయ్యింది. ఒకవిధంగా చెప్పాలంటే రోజా పార్టీలో తన ప్రత్యర్థులకు ఈ విధంగా సంకేతాలు పంపారా? అంటూ చర్చించుకోవడం కార్యకర్తల వంతైంది. రానున్న రోజుల్లో రోజా యాక్టివ్ అవుతుందని భావిస్తున్నారు హార్డ్‌కోర్ వైసీపీ అభిమానులు.