Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మాట్లాడేందుకు సిద్ధమవగా.. వెహికల్‌పైనే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే బొత్స సత్యనారాయణను ఆస్పత్రికి తరలించారు.
అప్పటివరకు యాక్టివ్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారాయన. కొంతదూరం ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేందుకు సిద్ధమైన సమయంలో.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల వైఎస్సార్సీపీ బస్సు యాత్రలో బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో టెస్టులు చేయించుకున్నారు. ఈసీజీ, 2డీ ఎకో లాంటి ప్రాథమిక పరీక్షల్లో బొత్సకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు తేలాయి. దీంతో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. డాక్టర్లు ఆయన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే, బోత్స మాత్రం ఏపీకి వెళ్లిపోయి పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో బొత్సా బుధవారం వడ దెబ్బకు గురయ్యారు.
బొత్స పరిస్థితిని చూసి కంగారు పడిన వైసీపీ నేతలు, నాయకులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. విజయనగరంలో చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ.. నవ్వుతూ కారు ఎక్కారు. విశాఖపట్నం బయల్దేరి వెళ్లారు బొత్స సత్యనారాయణ.
ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం గెలిచిన రోజును YS జగన్ వెన్నుపోటు దినోత్సవానికి పిలుపు నిచ్చారు. జూన్ నాలుగున కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న పథకాలు మాత్రం కదలట్లేదన్నారు జగన్. TDP పాలనకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినం సంబరాలు జరపాలని కార్యకర్తలకు, YCP నేతలను ఆదేశించారు. వెన్ను పోటు దినంకు మద్దతుగా మదనపల్లెలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ చేశారు వైసీపీ కార్యకర్తలు. ఎన్నికల ముందు వైసీపీని విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పథకాల విషయంలో సైలంట్ అయ్యారన్నారు.పథకాల పేరుతో వెన్నుపోటు పొడిచింది చాలన్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఆ పార్టీ నేతలు. 2019లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి రికార్డు సృష్టించారన్నారు. 2024లో ప్రజలను మోసం చేయడం ఇష్టం లేకనే ఆయన ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వలేదన్నారు.
Also Read: ఉన్మాదాన్ని తరిమికొట్టిన రోజు.. సీఎం చంద్రబాబు కామెంట్స్, ఏపీలో సర్వేలతో కలకలం
జగన్ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలన్న పిలుపుపై కూటమి పార్టీలు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రజా తీర్పును అవమానిస్తూ జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డాయి. దుష్టపాలన అంతం అయ్యి సుపరిపాలన వచ్చిన రోజుగా జరుపుకుంటామన్నాయి.