EPAPER

Bandla Ganesh: జీవితంలో ఎవరిని నమ్మొద్దు అంటూ బండ్ల గణేష్ ట్వీట్… హరీష్ మోసం చేశాడా?

Bandla Ganesh: జీవితంలో ఎవరిని నమ్మొద్దు అంటూ బండ్ల గణేష్ ట్వీట్… హరీష్ మోసం చేశాడా?

Bandla Ganesh : స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. ‘ఎవరినీ నమ్మొద్దు’ అంటూ బండ్ల గణేష్ చేసిన కామెంట్ ని చూసి హరిష్ శంకర్ మోసం చేశారా? అంటున్నారు నెటిజన్లు. అసలు బండ గణేష్ చేసిన ట్వీట్ ఏంటి? దానితో హరి శంకర్ కి సంబంధం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే….


జీవితంలో ఎవ్వర్నీ నమ్మొద్దు – బండ్ల గణేష్ 

నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘జీవితంలో ఎవర్ని నమ్మొద్దు. మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి’ అంటూ ఆయన ఎవరిని ఉద్దేశించి ట్విట్ చేశారు అన్న విషయం సస్పెన్స్ గా మారింది. దీంతో హరీష్ శంకర్ బండ్ల, గణేష్ కి మళ్ళీ గొడవ మొదలైందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా బండ్ల గణేష్ ను హరీష్ శంకర్ మోసం చేశాడా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణమే ఉంది. ‘గబ్బర్ సింగ్’  రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ తను మళ్ళీ సినిమాలను నిర్మిస్తానని, చిరంజీవి ఛాన్స్ ఇస్తే హరిష్ శంకర్ డైరెక్టర్ గా చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ ఇస్తానని ‘గబ్బర్ సింగ్’ వేదిక మీద ప్రామిస్ చేశాడు. కానీ తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఈ విషయంలోనే హరీష్, బండ గణేష్ మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా? అనే అనుమానం కలుగుతుంది.


హరీష్, బండ గణేష్ వివాదం

టాలీవుడ్ లో నటుడు నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ‘గబ్బర్ సింగ్’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. అంతేకాకుండా ఈ నిర్మాత పవన్ తన దేవుడు అంటూ ఎప్పటికప్పుడు పొగడ్తలతో ముంచేస్తాడు. అయితే ఈ ‘గబ్బర్ సింగ్’ మూవీ విషయంలోనే బండ్ల గణేష్ కు, హరీష్ శంకర్ కు మధ్య వివాదం నెలకొంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించగా, అప్పట్లో ఆ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అయితే ఈ మూవీ ఎనిమిదవ వార్షికోత్సవం సమయంలో హరిష్ శంకర్, బండ్ల గణేష్ మధ్య వాగ్వాదం జరిగింది. హరీష్ శంకర్ అందరికీ థాంక్స్ చెప్తూ ఓ లేఖను రిలీజ్ చేశారు. కానీ అందులో నిర్మాత అయిన బండ్ల గణేష్ పేరును ప్రస్తావించకపోవడంతో రచ్చ మొదలైంది. బండ్ల గణేష్ ఏకంగా హరిష్ శంకర్ ఒక రీమేక్ డైరెక్టర్ అంటూ, అతనితో మళ్ళీ సినిమా చేసే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ టైంలో వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధమే చేసుకున్నారు.  కానీ ఆ తర్వాత ఇద్దరూ సర్దుకుపోయారు. ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ చూస్తుంటే మళ్లీ ఇద్దరికీ చెడిందా ? అనే అనుమానం కలుగుతోంది.

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×