Cat Vs Snake: పిల్లులు పాములను ఎగరేస్తున్న వీడియోలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. కాటు వేసేందుకు పాము ప్రయత్నిస్తుంటే.. పిల్లి చాకచక్యంగా తప్పించుకునే వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చిన్న పిల్లి సైతం పెద్ద పామును సవాల్ చేసి విజయం సాధించగలదు.
పాములు ప్రమాదకరమైనవి, చాలా వేగంగా స్పందించగలవు. పాము కాటు ప్రాణాలు తీస్తుంది. పిల్లులు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటాయి. కానీ ఈ రెండు ఎదురుపడితే వీటి మధ్య పోరాటం ఆశ్చర్యకరంగా ఉంటుంది. పాము ఎంత వేగంగా కదిలినా పిల్లి ఆ పరిస్థితిని నియంత్రించినట్లు వీడియోల్లో కనిపిస్తుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో వైరల్ అవుతుంది.
బద్దకంగా, నిద్ర మత్తులో ఉన్న పిల్లి పామును ఎలా ఆటపట్టించిందో ఈ వీడియోలో ఉంది. చూడడానికి పాము, పిల్లి సరదాగా ఆడుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. నాకు ఇప్పుడు నీతో ఆడుకునే మూడ్ లేదు అన్నట్లు పిల్లి బిహేవ్ చేస్తుంటే.. రా కాచుకో అంటూ పాము బుస కొడుతుంది. అయితే ఈ ట్రెండ్ కేవలం వైరల్ వీడియోల గురించి మాత్రమే కాదు. సమాజంలోని భిన్నమైన ప్రవృత్తులు, వ్యూహాలను తెలియజేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ పిల్లి, పాము బెస్ట్ ఫ్రెండ్ అంటూ మరికొందరు కామెంట్స్ పెట్టారు.
?utm_source=ig_web_copy_link
పెంపుడు పిల్లులు ఇంట్లోనే ఉంటాయి. ఇవి ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటాయి, కానీ వాటి సహజ స్వభావం ఇప్పటికీ అలాగే ఉంటుంది. వెంటాడటం, దూకడం వంటి స్వభావాన్ని మాత్రం కోల్పోవు. బాగా ఆహారం తీసుకున్న పెంపుడు పిల్లులు తరచుగా బల్లులు, పక్షులు, కొన్నిసార్లు పాములు వంటి జంతువులను వేటాడతాయి. పిల్లి పామును చూసినప్పుడు భయపడదు. అందుకు బదులుగా చాలా ప్రశాంతంగా, జాగ్రత్తగా గమనిస్తుంది.
పాము బెదిరింపులకు దిగినప్పుడు మాత్రమే దాడి చేస్తుంది. పిల్లులు వాటి సహజ లక్షణం అయినటువంటి వేగవంతమైన ప్రతిచర్యలపై ఆధారపడతాయి. ఇవి ప్రశాంతంగా ఉంటూ చాలా వేగంగా స్పందిస్తూ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేస్తుంటాయి.
పిల్లులు పాముల కంటే చాలా వేగంగా స్పందిస్తాయి. పిల్లులు పాముల కంటే ఏడు రెట్లు వేగంగా స్పందించగలవని పరిశోధకులు అంటున్నారు. పిల్లులు పాము కాటు నుండి త్వరగా తప్పించుకోవడానికి, వేగంగా తిరిగి దాడి చేయడానికి వాటి సహజ స్వభావం కారణమంటున్నారు. పిల్లులు పుట్టిన కొన్ని వారాల తర్వాత వాటి ప్రతిచర్యలు, సమన్వయాన్ని నిర్మించుకోవడం ప్రారంభిస్తాయి. ఈ నైపుణ్యాలు అవి పెరిగేకొద్దీ పెరుగుతాయి.
పాములు సహజంగా సరళ రేఖలో వేగంగా కాటు వేస్తాయి. కానీ దాడి సమయంలో పాము కదలిక పరిమితంగా ఉంటుంది. అవి అదునుచూసి కాటు వేయడానికి ప్రయత్నిస్తుంటాయి. మరోవైపు పిల్లులు సరళమైన శరీరాలను, గొప్ప సమన్వయాన్ని కలిగి ఉంటాయి. అవి పక్కకు దూకగలవు, వెనక్కి కదలగలవు లేదా వేర్వేరు వైపుగా తమ శరీరాన్ని నియంత్రించుకుంటాయి.
Also Read: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?
పిల్లికి కళ్లు చాలా బలమైన ఇంద్రియాలు. అవి చీకటిలో కూడా స్పష్టంగా చూడగలవు. అలాగే మానవులు వినలేని చాలా చిన్న శబ్దాలను వినగలవు. వాటి మీసాలు కూడా చుట్టూ కదలికలను పసిగట్టగలవు. పాములకు వేడిని గ్రహించడం, భూమి ప్రకంపనలను గ్రహించడం వంటి కొన్ని ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. కానీ వాటి కంటి చూపు అంత మెరుగ్గా ఉండదు. అలాగే పాములు అంత బాగా వినలేవు.