Ysrcp Women Wing: కూటమి సర్కార్ ను బద్నామ్ చేసేందుకు వైసీపీ స్కెచ్ వేసిందా? మహిళలతో ఆందోళన నిర్వహించి ప్రభుత్వాన్ని ఆడిపోయాలని ప్లాన్ చేసిందా? పార్టీ చేసే నిరసనలు, ధర్నాల కంటే మహిళలపై చేస్తే మైలేజ్ వస్తుందని భావించిందా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.
జగన్ కొత్త స్కెచ్
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు 10 నెలలు గడిచిపోయింది. అయినా సరే విపక్ష వైసీపీ బయటకు రాలేకపోతోంది. ఎంతసేపు పార్టీ ఆఫీసులో మీడియా సమావేశాలతో సరిపెడుతున్నారు అధినేత జగన్. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లిపోయారు. దీనికితోడు నేతల సహకారం లేకపోవడంతో ఆందోళనలు చేసినా ఊహించని మైలేజ్ రావడంలేదు.
ఈ క్రమంలో ఏం చేయ్యాలో ఆలోచనలో పడింది ఫ్యాన్ పార్టీ. పరిస్థితి గమనించిన వైసీపీ, తొలిసారి తిరుపతిలో మహిళల చేత వినూత్నం నిరసన చేపట్టింది. ఫ్రీ బస్సు పథకం గురించి తొలిసారి చేపట్టిన ఈ ప్రయోగం మంచి ఫలితం వచ్చింది. మీడియాలో కూడా హైలైట్ అయ్యింది. వైసీపీ ఉందనే విషయం చాలామంది తెలిసింది.
మహిళలతో ఆందోళనలు
ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత బస్సు కూడా ఒకటి. ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతి మహిళలు వెరైటీగా నిరసన చేశారు. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కారు వైసీపీ మహిళలు. కండక్టర్ టిక్కెట్ అడిగితే తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
ఆనాడు తిరుపతి సభలో చంద్రబాబు చెప్పిన నాలుగు మాటలు గుర్తు చేశారు. టికెట్ అడిగితే చంద్రబాబు పేరు చెప్పమన్నారని ఆ మహిళలు సమాధానమిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన వీడియోను కండక్టర్‌కి చూపించారు. చంద్రబాబు వేష ధారణలో ఓ వ్యక్తి కండక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్పించారు.
ఏం చేయాలో తెలియక కాసేపు తికమకపడ్డారు బస్సు కండక్టర్. ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని రిప్లై ఇచ్చారు. చివరకు కండక్టర్-మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఏమి చెయ్యలేక కండక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు కండక్టర్. పోలీసుల సూచనల మేరకు బస్సును నేరుగా ఎస్వీ యూనివర్సిటీ స్టేషన్‌కు తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు వైసీపీకి చెందిన 35 మహిళలపై కేసు నమోదు చేశారు.
మరోవైపు మహిళలు బస్సులో ఆందోళనలు చేసిన వీడియోకు గతంలో చంద్రబాబు ఫ్రీ బస్సు గురించి చెప్పిన వీడియో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో ఆడుకోవడం వైసీపీ వంతైంది. ఇదేమి మాస్ ర్యాగింగ్ బాబూ అంటూ రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి.
ఉచిత బస్సుపై సభలో చర్చ
అన్నట్లు మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ఉగాది నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కాకపోతే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలో ఉచితంగా తిరిగేలా ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించింది వైసీపీ. మండలిలో వైసీపీ నేతలు ఉచిత బస్సు పథకం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కూడా.
ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ రా .. మామా !#CBNFailedCM pic.twitter.com/ekMSJv4TwO
— జగన్నాథరథచక్రం (@Radhachekram) March 19, 2025