BigTV English

Trump H1B Visa: హెచ్‌-1బీ వీసాలో కీలక మార్పులు.. ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Trump H1B Visa: హెచ్‌-1బీ వీసాలో కీలక మార్పులు.. ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Trump H1B Visa| అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా హెచ్-1బీ వీసా అమలులో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పాత దరఖాస్తులను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే (ఫ్లాగ్) నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారి విషయంలో పూర్తి దృష్టి పెట్టారు. ఇప్పటికే అనేక దేశాల వలసదారులను అమెరికా నుంచి బయటకు పంపించారు. అనేక దేశాలపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించారు. ఇప్పుడు తాజాగా అమెరికా హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ క్రమంలోనే అమెరికా హెచ్-1బీ వీసా అమలులో మార్పులు చేస్తోంది. ఈ నిర్ణయం క్రింద పాత దరఖాస్తులను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే (ఫ్లాగ్) నుండి తొలగిస్తోంది. వీసాల జారీ కోసం యూఎస్ ఇమిగ్రేషన్ విభాగం త్వరలోనే  కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. అందుకే పాత రికార్డులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం కొత్త వ్యవస్థను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రవేశపెట్టనుంది.


తాజా ఆదేశాల ప్రకారం, మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. అంటే, ఉదాహరణకు ఒక దరఖాస్తుకు సంబంధించిన 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే, ఈ ఏడాది మార్చి 22న దాని రికార్డులను తొలగిస్తారు. హెచ్-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనుందని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది.

Also Read: అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ హత్య వెనుక రహస్యాలు.. బహిర్గతం చేసిన ట్రంప్

ఇక, ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే (ఫ్లాగ్) అనేది అమెరికాలో కార్మికులకు సహాయపడే పోర్టల్. ఇది అమెరికా మరియు విదేశీ కార్మికులకు రక్షణ కల్పిస్తుంది. ఈ పోర్టల్‌లో H-1B, H-1B1, H-2A, H-2B, E-3 వీసాలు మరియు శాశ్వత కార్మిక ధృవీకరణ దరఖాస్తులు సేవ్ చేయబడతాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో గత ఐదేళ్లకు ముందుగా సేవ్ చేయబడిన దరఖాస్తులను ఈ రోజు రాత్రి నుంచి తొలగించనున్నట్టు కార్మిక శాఖ ఉపాధి, శిక్షణ పరిపాలన, విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం (OFLC) తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంది.


H-1B వీసాదారులకు హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలనలో ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. హెచ్-1బీ వీసా హోల్డర్లు, ఎఫ్-1 వీసా హోల్డర్లు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్‌కార్డు హోల్డర్లకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపై ట్రంప్.. ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు చేయడంతో.. వీసా రెన్యువల్ కోసం స్వదేశం వెళ్లిన వారికి తిరిగి అమెరికాకు రావడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్స్‌లో స్టాంపింగ్‌లో జాప్యాలు, విస్తృత తనిఖీలు.. విమానాశ్రయాల్లో నిర్బంధాలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

సీటేల్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ కృపా ఉపాధ్యాయ్ ప్రకారం.. హెచ్-1బీ లేదా ఎఫ్-1 వీసా రెన్యువల్ కోసం అమెరికా దాటి వెళ్లాలనుకునేవారు ఇప్పుడు బాగా ఆలోచించుకోవాలి. ఇంటర్వ్యూ మినహాయింపు నియమాలు మార్చబడినందున.. 12 నెలల్లోపు గడువు ముగిసిన వలసేతర వీసాదారులకు మాత్రమే ఇంటర్వ్యూ మినహాయింపు అనుమతిస్తున్నారు. అందువల్ల.. ఎఫ్-1 లేదా హెచ్-1బీ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూ స్లాట్ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×