BigTV English

Ballerina: ఈమె ‘జాన్ విక్’తోనే యుద్ధం చేస్తుంది…

Ballerina: ఈమె ‘జాన్ విక్’తోనే యుద్ధం చేస్తుంది…

Ballerina: జాన్ విక్ ఫ్రాంచైజ్ మరో పవర్‌ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “బెల్లెరినా” అనే ఈ సినిమా, జాన్ విక్ ప్రపంచంలో చోటుచేసుకునే కథతో తెరకెక్కింది. జాన్ విక్ సినిమాలు యాక్షన్ సినీమాల స్థాయిని ఓ కొత్త లెవెల్‌కి తీసుకెళ్లాయి. పెన్సిల్ నుంచి గన్ వరకు, అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించి ఫైట్స్ డిజైన్ చేయడంలో ఈ ఫ్రాంచైజ్ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. నాలుగు సినిమాలుగా కొనసాగుతున్న ఈ కల్ట్ ఫ్రాంచైజ్ ఇప్పుడు తన వరల్డ్ ని మరింత ఎక్స్పాండ్ చేయడానికి రెడీ అయింది.


బెల్లెరినా అనే టైటిల్ తో హాలీవుడ్ లో ఇంతకుముందే ఓ సినిమా వచ్చింది, ఆ సినిమా కథతో ఈ సినిమాకు పెద్దగా సంబంధం లేదు. కేవలం టైటిల్ క్యారెక్టర్‌ను తీసుకుని, దాన్ని జాన్ విక్ యూనివర్స్‌లోకి తీసుకురావడమే మేకర్స్ ప్లాన్ చేశారు. దీని ద్వారా ఫ్రాంచైజ్‌ను మరింత బలంగా నిర్మించే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధాన పాత్రలో అనా డి ఆర్మాస్ నటిస్తోంది. హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్, బెల్లెరినా క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ గా సరిపోతుందనే అభిప్రాయం ట్రైలర్ చూసిన వెంటనే ప్రేక్షకుల్లో కలిగింది.

ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మించి ఉండేలా ట్రైలర్ కట్ చేసారు. అనా డి ఆర్మాస్ యాక్షన్ పర్‌ఫార్మెన్స్, హై ఓక్టేన్ స్టంట్స్, ఇంటెన్స్ సన్నివేశాలు ట్రైలర్‌లో హైలైట్ అయ్యాయి. ట్రైలర్ చివరి క్షణాల్లో కీను రీవ్స్ ఎంట్రీ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే  విషయం. అటువంటి జాన్ విక్ ని ట్రైలర్ ఎండ్ లో రివీల్ చేసారు. జాన్ విక్ క్యారెక్టర్ బెల్లెరిన సినిమాలో ఎంతవరకూ కీలకం అనే దానిపై ఇంకా క్లారిటీ లేకపోయినా, బెల్లెరినా కథను టర్న్ చేయడానికి జాన్ విక్ ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు.


ఈ సినిమాలో అనా డి ఆర్మాస్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే జాన్ విక్ వరల్డ్ అంటే ఊహించినదాని కన్నా ఎక్కువ యాక్షన్, థ్రిల్ ఉంటాయి. ఆ వరల్డ్ లోకి అడుగుపెడుతున్న బెల్లెరినా క్యారెక్టర్ అదే స్థాయిలో ఉంటుందా, లేక ఇంకో కొత్త యాంగిల్‌ నుంచి ప్రేక్షకులను కనెక్ట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. జాన్ విక్ సినిమాల్లో వినిపించిన “ది హై టేబుల్” అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో ముఖ్యమైన భాగమవుతుందా అనే టాక్ కూడా వినిపిస్తోంది.

బెల్లెరిన మరియు జాన్ విక్ క్యారెక్టర్స్ మధ్య ఎలాంటి డైనమిక్స్ ఉంటాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ట్రైలర్ చూస్తుంటే వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికరమైన వార్ జరగబోతోందని అర్థమవుతోంది. ఫైట్స్ విషయంలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అనా డి ఆర్మాస్, కీను రీవ్స్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ అవుతాయనే టాక్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరింత బలంగా మారింది.

జూన్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ట్రైలర్‌తో మరింత పెరిగిపోయాయి. ఒక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్‌తో జాన్ విక్ లెవెల్‌లో సినిమా తీస్తే అది ఎంతవరకూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందో చూడాలి. అయితే ఇప్పటివరకు ట్రైలర్ చూపించిన విజువల్స్, యాక్షన్, ఇంటెన్సిటీ చూస్తుంటే, బెల్లెరిన జాన్ విక్ ఫ్రాంచైజ్‌కు తగిన సినిమా అవుతుందనే నమ్మకం కలుగుతోంది. యాక్షన్ మూవీ ఫ్యాన్స్‌కి, స్పెషల్‌గా జాన్ విక్ లవర్స్‌కి బెల్లెరినా మరో అదిరిపోయే అనుభూతిని అందించబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×