Big Stories

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర 218వ రోజుకు చేరింది. ఆదివారం తుని అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. తుని నియోజకవర్గంలో చేసిన పర్యటనతో.. యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తవ్వడంతో గుంటూరులో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులోని శిల్పారామం నుంచి అమరావతి రోడ్డు వరకూ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. యువగళానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో ముందుకెళ్తూ.. యాత్రను కొనసాగిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ ప్రభంజనం ఖాయమన్నారు.

- Advertisement -

ఆదివారం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవ్వగా.. లోకేష్ ఒంటిమామిడి జంక్షన్లో మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తొండంగి హనుమాన్ జంక్షన్ లో రైతులతో సమావేశమయ్యారు. శృంగవృక్షంలో ఎస్సీ సామాజిక వర్గీయులను కలిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. మధ్యాహ్నం కాకినాడ సెజ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News