
హైదరాబాద్ అనగానే.. నోరూరించే బిర్యాని, పర్యాటకానికి ఫేమస్. వీకెండ్ వచ్చిందంటే చాలామంది మంచి బిర్యాని తిని.. చుట్టు పక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసులను దర్శంచాలనుకుంటారు. అలాంటి వారు ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్‌కు దగ్గరలోనే అదిరిపోయే అడ్వెంచర్ స్పాట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
బంగీ జంపింగ్
ఎత్తైన ప్రదేశాల నుంచి బంగీజంప్ చేయాలంటే.. చాలా గుండె ధైర్యం కావాలి. అలాంటి అడ్వెంచర్.. రామోజీ ఫిల్మ్ సిటీ, లియోనియా రిస్తార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి.

పారాగ్లైడింగ్
ఆకాశంలో పారాగ్లైడింగ్ చేస్తూ.. పక్షుల్లా గాలిలో ఎగరాలని అందరికీ ఉంటుంది. అలాంటి అనుభూతిని అనుభవించాలంటే.. హైదరాబాద్‌లోని కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర్లో అందుబాటులో ఉంది.

స్కైడైవింగ్
వేల అడుగుల ఎత్తున ఉన్న విమానం నుంచి దూకుతూ చేసే స్కైడైవింగ్ అద్భుతంగా ఉంటుంది. దీనిని ఇండోర్‌లో ఆశ్వాదించాలంటే.. గండిపేటలో ఉన్న గ్రావిటీజిప్ అడ్వంచర్ స్టోర్స్‌ను విజిట్ చేయాల్సిందే.

జిప్‌లైన్
వందల అడుగుల ఎత్తులో జిప్‌లైన్ అడ్వంచర్‌అనుభూతి చెందాలంటే.. శామీర్ పేట్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, ఎక్సోటికా బొటిక్ రిసార్ట్‌ల్లో అందుబాటులో ఉన్నాయి.
