Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 8వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: బంధువులతో మాటపట్టింపులు వద్దు. శతృవుల పీడ అధికం. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ప్రభుత్వ అధికారుల అండదండలు ఉంటాయి. శని ప్రభావం అధికం. విలాసవంతమైన జీవితాన్ని ఈరోజు అనుభవిస్తారు. సోదరులు మీపై అధిక ప్రేమ కురిపిస్తారు. మీ నిర్ణయాలే మీకు శాపాలుగా మారుతాయి.
ఈరోజు మీ అదృష్టసంఖ్య:4
కలిసివచ్చేరంగు: గోధుమ రంగు
9సంవత్సరాలలోపు మగపిల్లలకు తినుబండారాలు కొనివ్వండి.
వృషభరాశి: పెట్టుబడుల ద్వారా లాభాలు గడిస్తారు. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. మతపరమైన చర్చలు జరుపుతారు. ఆశించిన పనులు వాయిదా పడుతాయి. సోదరులతో ఆస్తి వ్యవహారాలు చర్చిస్తారు. స్త్రీ మూలకంగా ధననష్టం. సంతానంతో గొడవలు మానసిక అశాంతి.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 07
కలిసివచ్చేరంగు: బూడిదరంగు
ఆంజనేయస్వామికి అరటిపండ్లు సమర్పించండి.
మిథునరాశి: గృహంలో అశాంతి. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వాగ్వాదం జరపకండి. వృత్తి, వ్యాపార విస్తరణకై సమావేశాలు జరుపుతారు. మిత్రుల సలహాలు పాటించండి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 09
కలిసి వచ్చే రంగు: ఎరుపురంగు
సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పచ్చకర్పూరం సమర్పించండి.
కర్కాటకరాశి: విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. షేర్లలో పెట్టుబడి పెట్టండి. లాభాలు పొందుతారు. గండాలు పొంచి ఉన్నాయి. నమ్మినవారితో జాగ్రత్తగా ఉండండి. ముఖంపై గాయాలు ఏర్పడే అవకాశంఉంది. స్థిరాస్తుల విక్రయం జరుపుతారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య6
కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ
పావురాలకు పెసర్లు వేయండి.
సింహరాశి: రాజయోగం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యవహార చిక్కులు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడంతో పరువు నష్టం. ధనవ్యయం. శిరోభారంతో స్వల్ప అస్వస్థత ఏర్పడుతుంది. షేర్లలో పెట్టుబడుల వల్ల లాభాలు గడిస్తారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2
కలిసివచ్చే రంగు:వాయిలెట్ రంగు
గణపతి దేవాలయాన్ని దర్శించి గరిక సమర్పించండి.
కన్యారాశి: అనుకోని ప్రమాదాల వల్ల గాయాలు. యంత్రాల వల్ల, పదునైన ఆయుధాల వల్ల గాయాలు ఏర్పడుతాయి. కెమికల్, నిప్పు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. గృహంలో శాంతి, సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికలాభాలు ఉన్నాయి. పెట్టుబడులు ద్వారా లాభాలు పొందుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య4.
కలిసివచ్చేరంగు: తెలుపురంగు
మహాలక్ష్మీదేవిని ధ్యానించండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. వ్యతిరేక శక్తులు ఉంటాయి. ధననష్టం అధికం. ముఖమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు పరిశీలన అవసరం. వైవాహిక జీవితంలో ఊహించని సమస్యలు పెద్దల జోక్యంతో పరిష్కారమవుతాయి. ఓర్పు, నేర్పుతో మీ పనులు సాధించుకుంటారు.
ఈరోజు అదృష్ట సంఖ్య1
కలిసివచ్చేరంగు: ముదురు పచ్చరంగు
ఆంజనేయస్వామిదగ్గర ఆవునెయ్యితో దీపం వెలిగించండి.
వృశ్చికరాశి: ధనలాభం కలుగుతుంది. భూ విక్రయాల్లో లాభం. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం కలదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తోటివారి సలహాలు, సూచనలు పాటించండి. పెద్దలతో మర్యాదగా వ్యవహరించండి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య4
కలిసివచ్చేరంగు: బూడిదరంగు
పుట్టలో పాలు పోసి ఆమట్టిని నుదుట తిలకంగా ధరించండి.
ధనస్సురాశి: అంతరాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించకండి. మనస్పూర్తిగా చేసే పనులపై దృష్టి సారించండి. నలుగురితో కలిసి పనిచేయండి. అందరూ మన వారే అన్న భావన మంచి చేస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ప్రతీది గతజన్మల రుణమే అన్నట్టుగా ఉంటుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య9
కలిసివచ్చే రంగు: కాషాయం రంగు
శివాలయాన్ని దర్శించుకోగలరు శుభం కలుగుతుంది.
మకరరాశి: మీ ప్రయత్నాలలో పట్టువీడని విక్రమార్కుడిలా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవలు చేస్తారు. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. మరుపురాని విషయం ఒకటి మానసికంగా వేధిస్తుంది. గురువుల దర్శనభాగ్యం సంతోషాన్ని కలుగచేస్తుంది.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 7
కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ రంగు
ఏదైనా శక్తి క్షేత్రాన్ని సందర్శించండి.
కుంభరాశి: గడుస్తున్న కాలం మాయగా తోస్తుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. మీరు స్వప్నంలో దర్శించిన కొన్ని సంఘటనలు నిజజీవితంలో అనుభవంలోకి వస్తాయి. నరఘోష అధికంగా ఉంటుంది. మానసికంగా చపలచిత్తంతో వ్యవహరిస్తారు. మీ ప్రవర్తన కుటుంబసభ్యులలో ఆందోళన కలిగిస్తుంది.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 6
కలిసివచ్చేరంగు: గోధుమరంగు
కులదేవతకు మహానైవేద్యం ఏర్పాటు చేయండి.
మీనరాశి: మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాల్లో నిరాశకు గురవుతారు. కార్యసాధకులు ఎప్పుడూ వెనుకడుగు వేయరన్న విషయం గుర్తుంచుకోండి. మేధాశక్తికి పదును పెట్టండి. రహస్య మంతనాలు జరుపుతారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8
కలిసివచ్చే రంగు: గోల్డ్ కలర్
కాలభైరవాష్టకం, లేదా హనుమాన్ చాలీసా పఠించండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే