Ginger Honey Benefits: అల్లం, తేనె రెండూ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయుర్వేదంలో కూడా వివరించబడింది. ఇదిలా ఉంటే.. ఈ రెండు కలిపి తింటే.. శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం అభిస్తుంది. అంతే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ రెండింటిలోనూ ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అల్లం , తేనె కలిపి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుుడు తెలుసుకుందాం.
ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
తేనె, అల్లం రెండూ యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉన్నాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమం వైరల్ ఇన్ఫెక్షన్లు, కాలానుగుణ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక చెంచా తేనె అల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుంచి బలపడుతుంది.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం:
అల్లంలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, తేనెలో ఉండే ఉపశమన లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఇవి శ్లేష్మం వదులుగా మారడానికి, శ్వాసనాళాన్ని తెరవడానికి సహాయపడతాయి. వర్షాకాలంలో ఈ రెండింటి కలయిక శరీరానికి చాలా ముఖ్యం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
అల్లం కడుపులో గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది, తేనె పేగులకు ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో అల్లం, తేనె కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఆకలి కూడా మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Also Read: కొత్తిమీరతో మ్యాజిక్.. ఇలా తింటే బోలెడు ప్రయోజనాలు !
బరువు తగ్గడంలో సహాయం:
గోరువెచ్చని నీటితో అల్లం, తేనె కలిపి తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది కొవ్వును తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా అల్లం, తేనె పొట్ట దగ్గర ఉండే కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయని భావిస్తారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గడానికి ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుదల:
అల్లం, తేనె రెండూ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఫలితంగా గుండెను కూడా బలంగా తయారవుతుంది.