BigTV English

OTT Movie : 8 ఏళ్ల పాపపై అఘాయిత్యం… బ్లడ్ బాయిలయ్యే మలయాళ క్రైమ్ డ్రామా

OTT Movie : 8 ఏళ్ల పాపపై అఘాయిత్యం… బ్లడ్ బాయిలయ్యే మలయాళ క్రైమ్ డ్రామా

OTT Movie : ఎమోషనల్ డ్రామా, సోషల్ మెసేజ్ ఇష్టపడేవాళ్లకు, ఒక మలయాళం సినిమా ఫ్రీగానే అందుబాటులో ఉంది. ఈ సినిమా ఎనిమిదేళ్ల అమ్మాయి దారుణంగా హత్యకు గురవడం, ఆ తర్వాత న్యాయం కోసం జరిగే పోరాటంతో ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమా POCSO అంశాన్ని ఎమోషనల్‌గా, సమాజంలో జరిగే అన్యాయాలను చూపిస్తూ తీసారు. ఈ సినిమాపేరు? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకివెళ్తే …


కథలోకి వెళ్తే

ఈ స్టోరీ ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ఒక ఎనిమిదేళ్ల అమ్మాయి, తన పేద కుటుంబంతో ఆనందంగా ఉంటుంది. ఒక డ్రగ్ అడిక్ట్ అయిన ఇన్‌ఫ్లుయెన్షియల్ వ్యక్తి చేతిలో దారుణంగా అఘాయిత్యానికి గురై చనిపోతుంది. ఈ అమ్మాయి కుటుంబం పూర్తిగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఆ చిన్నారి వాళ్ల జీవితంలో ఒకే ఒక సంతోషం. ఈ ఘటన ఊరిలో గొడవలు రేగకుండా ఉండేందుకు, ఎనిమిది మంది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల బృందం, సీనియర్ ఆఫీసర్ నాయకత్వంలో, ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి బయల్దేరుతుంది. ఈ ఘటన వల్ల ఊరిలో జనం ఆగ్రహంతో ఉంటారు. పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్‌గా మారుతుంది. సమాజంలో ఈ ఘటన వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయి. కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తుంది. కానీ ఒక పవర్‌ఫుల్ వ్యక్తి వల్ల ఇన్వెస్టిగేషన్‌లో అడ్డంకులు వస్తాయి.


Read Also : ఎమ్మెల్యే ఇంట్లో పనసకాయలు మిస్సింగ్… గిలిగింతలు పెట్టే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా

పోలీసు బృందంలోని ఒక ఆఫీసర్ ఈ కేసుని పర్సనల్‌గా తీసుకుంటాడు. ఎందుకంటే అతనికి కూడా ఒక చిన్న కూతురు ఉంటుంది. ఈ కేసు వాళ్ల బృందంలోని ఒక్కొక్కరి మానసిక స్థితిని, వాళ్ల డ్యూటీని ప్రభావితం చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్నప్పుడు, నేరస్తుడి పవర్‌ఫుల్ కనెక్షన్స్ బయటపడతాయి. దీనివల్ల న్యాయం జరగడం కష్టతరం అవుతుంది. ఈ కుటుంబం బాధలో మునిగిపోతుంది. ఇక ఊరి జనం న్యాయం కోసం గొడవ చేస్తారు. సినిమా క్లైమాక్స్‌లో ఈ కేసు ఎలా ముగుస్తుంది ? న్యాయం జరుగుతుందా లేదా ? నేరస్తుడు ఎవరు ? అనేది ఉత్కంఠతను పెంచుతుంది. ఈ సోషల్ మెసేజ్ క్లైమాక్స్ తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళం థ్రిల్లర్ సినిమాపై ఓలుక్ వేయండి.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

‘కాక్కిపడ’ (Kakkipada) ఒక మలయాళం థ్రిల్లర్ సినిమా. షెబీ చౌఘట్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సుజిత్ శంకర్, అప్పానీ శరత్, నిరంజన్ మణియన్‌పిళ్ల రాజు, ఆరాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. 2022 డిసెంబర్ 30న ఈ సినిమా థియేటర్‌లో విడుదలై, IMDbలో 6.5/10 స్కోర్ పొందింది. 131 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

OTT Movie : బుర్ర తక్కువ వాడితో యవ్వారం…ఐఎండీబీలో 8.3 రేటింగ్… పిచ్చెక్కించే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కన్న కూతురిని జూదానికి బలిచ్చే తండ్రి… మొత్తం అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్… హిస్టరీలో మిస్టరీగా మిగిలిన రా ఆపరేషన్… స్పై థ్రిల్లర్ ప్రియులకు పండగే

OTT Movie : చావుకు దగ్గరైన వాళ్ళను సింథటిక్ బొమ్మలుగా… ఏలియన్ ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్… భవిష్యత్తు అంటేనే భయపెట్టే సై-ఫై సిరీస్

Big Stories

×