Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. భట్టి విక్రమార్క అప్పుల విషయంలో అబద్దాలు, అర్థ సత్యాలు చెప్పి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేడని మండిపడ్డారు. భట్టి చాలా సీనియర్ నాయకుడు, ఆర్ధిక మంత్రి అని, ఆయనకు అప్పుల విషయంలో వాస్తవాలు తెలియని నేను అనుకోవడం లేదన్నారు. తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని, లేని అప్పులను ఉన్నట్లుగా చూపి గోబెల్స్ ప్రచారానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అప్పుల విషయంలో మంత్రి జూపల్లి సవాళ్లు చేసి తోక ముడిచిన తీరును యావత్ తెలంగాణ సమాజం చూసిందన్నారు. ఆ అవమానం నుంచి ఎలాగైనా బయటపడాలనే భావనతో, ఆత్మరక్షణలో భాగంగా భట్టి.. అప్పులపై తప్పుడు లెక్కలు వండి వార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం అప్పుల విషయంలో క్లిస్టర్ క్లియర్ గా ఉన్నాం. వాళ్ల లాగా పూటకో మాట చెప్పడం, ఇష్టం ఉన్నట్లు లెక్కలు చెప్పడం లేదన్నారు. మాది అసెంబ్లీలో ఒకటే మాట, బహిరంగ సమావేశాల్లో ఒకటే మా, ప్రెస్ మీట్లలో ఒకటే మాట అని స్పష్టం చేశారు.
హామీలు ఎందుకు అమలు చేయడం లేదు?
అప్పులు అప్పులు.. అంటూ ఎందుకు కుంటి సాకులు, సొల్లు పురాణం చెబుతున్నరు అని భట్టిని నిలదీశారు. కరోనా వచ్చినా ఎకానమీ డౌన్ అయినా కేసీఆర్ ఏనాడూ రాష్ట్రం దివాళా తీసింది అనలేదన్నారు. మరి ఇప్పుడు కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు.. ఎందుకు రాష్ట్రం దివాళా దివాళా అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీది అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. పనికిరాని దక్షత లేని పాలన అని ఒప్పుకుంటున్నారా? మీ బిల్డప్ అంతా ఉత్తదే అని రెండున్నరేండ్ల పాలనలోనే అర్థమైందన్నారు. మీ అపారమైన అనుభవం కమీషన్లు దండుకోవడానికి తప్ప రాష్ట్ర అభివృద్దికి ఉపయోగపడలేదన్నారు. ఎన్నికల సమయంలో అది చేస్తం, ఇది చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చాక సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, నమ్మించి నయవంచన చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
భట్టిని ప్రశ్నించిన హరీష్ రావు
ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా చూసుకోకుండా ఎవరో తయారు చేసిన నోట్ చదివిండు.. అట్ల అబద్దాలు మాట్లాడొచ్చునా? భట్టి అని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 8,21,651 కోట్లు అని మల్లా అదే కట్టుకథ చెప్పిండన్నారు. 2023 డిసెంబర్ 7 నాటికి ప్రభుత్వం రూ.4,17,495 కోట్లు మాత్రమే అన్నారు. ఎన్ని కలిపినా వాళ్లు చెప్పిన 8,21,651 కోట్లు నిండటం లేదని అందులో ఏం ఏం కలిపారో మీరే చూడండి అని నిలదీశారు. ప్రభుత్వం గ్యారెంటీ ఉండి, కార్పోరేషన్లు చెల్లించేవి, ప్రభుత్వం గ్యారెంటీ లేకుండా కార్పోరేషన్లే చెల్లించేవి కలిపారని, నిజానికి ఈ రుణాలు వాటికవే చెల్లిస్తాయని తెలిపారు. ఆర్బీఐ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లోనే ఉంటది ఎవరైనా తెలంగాణ అప్పులు ఎంత తెచ్చిందో చూడొచ్చు అన్నారు. ఇది మాత్రమే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు గురించి కాగ్ రిపోర్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందన్నారు.
Also Read: చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన అంబటి.. ఆ ఆస్తి లోకేష్ పేరిట ఎలా రాశారు?
అసెంబ్లీలో ఒక లెక్క, పత్రికా సమావేశాల్లో ఒక లెక్క?
మిషన్ భగీరథ, కాళేశ్వరం, సీతారామ, స్కీలకు సంబంధించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 4,10,819 కోట్లు అని కాగ్ స్పష్టం చేసిందన్నారు. కాగ్ రిపోర్టు మీరు డిసెంబర్ 2023 వైట్ పేపర్ లో చెప్పిన ప్రకారం, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 4.17లక్షల కోట్లు అని వెల్లడించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు 8లక్షల కోట్ల అప్పు అన్నాడు.. తెల్లారి 7లక్షల కోట్ల అప్పు అన్నాడు..శ్వేతపత్రంలో ఒక లెక్క, అసెంబ్లీలో ఒక లెక్క, పత్రికా సమావేశాల్లో ఒక లెక్క ఉంటదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మల్లించడం కోసం, మీరు చేస్తున్న స్కాంల నుంచి డైవర్షన్ చేయడం కోసం అప్పుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. స్కాంలు బయట పడుతుంటే, ప్రజలు తిరగబడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై జూపల్లి సవాళ్లు చేసిన తోక ముడిచారన్నారు.
చేతనైతే పాలన మీద దృష్టి పెట్టండి
చేతనైతే పాలన మీద దృష్టి పెట్టండి అని సూచించారు. లంచాలు ఇచ్చి అప్పులు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఇలాంటి దుస్థితి ఎక్కడా లేదన్నారు. జూన్ 30 నాటికి పబ్లిక్ డొమైన్ ఉన్న లెక్కల ప్రకారం, 31 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 4లక్షల 50వేల కోట్లు అన్నారు. ధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, కేసీఆర్ శిష్యుడిగా చెబుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17లక్షల కోట్లు మాత్రమేనన్నారు. దీనికి నేను కట్టుబడి ఉన్నానని ఏ చర్చకైనా సిద్దం అని స్పష్టం చేశారు. అసెంబ్లీ పెట్టండి మాట్లాడుదాం అని సవాల్ చేశారు.
Also Read: ‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!