E-Paper
Advertisement

New Driving Licence Rules: 3 గంటల టెస్ట్, 6 మాడ్యూల్స్.. ఏప్రిల్ నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్!

New Driving Licence Rules: 3 గంటల టెస్ట్, 6 మాడ్యూల్స్.. ఏప్రిల్ నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్!
Advertisement

New Driving Licence Rules in Telangana: రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, పెరుగుతున్న మరణాలను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మరింత కఠినమైన పరీక్షలు నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు,  లెర్నర్ లైసెన్స్ (LLR) కోసం దరఖాస్తు చేసుకునే ముందే ఆన్‌ లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్షను తప్పనిసరి చేయనుంది. నిజానికి రోడ్డు ప్రమాదాల కారణంగా తెలంగాణలో ప్రతి సంవత్సరం 7,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు 28,000 మంది గాయపడుతున్నారు. దేశా వ్యాప్తంగా దాదాపు 1.7 లక్షల మంది మరణిస్తున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, అవగాహన లేకపోవడమే ప్రధాన కారణాలని అధికారులు చెబుతున్నారు.

మూడు దశల లైసెన్సింగ్ విధానం

ప్రస్తుతం, డ్రైవింగ్ లైసెన్స్ పొందడంలో రెండు దశలు ఉంటాయి. లెర్నర్ లైసెన్స్, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష. కొత్త విధానం మూడవ దశను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ఆన్‌ లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్షను చేర్చారు. ఏప్రిల్ నుంచి దరఖాస్తుదారులు LLR కోసం దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా ఆన్‌లైన్ భద్రతా పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది.

ఆరు మాడ్యూళ్లు, మూడు గంటలు

Advertisement

రోడ్డు భద్రతా పరీక్షలో ఆరు మాడ్యూళ్లు ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల నిడివిని కలిగి ఉంటుంది. మొత్తం మూడు గంటల సమయం పడుతుంది. ఈ పరీక్ష పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు ఒక ప్రత్యేకమైన సర్టిఫికేట్ నంబర్‌ ను పొందుతారు. ఇది LLR దరఖాస్తుకు తప్పనిసరి. ఈ అవగాహన ఆధారిత విధానం కొత్త డ్రైవర్లు తీవ్రమైన తప్పులను నివారించడంలో సహాయపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ పరీక్షలో పాస్ కావడం సులభమే అయినా, దరఖాస్తుదారులలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తనను పెంపొందించడానికి ఇది చాలా అవసరమంటున్నారు.

Read Also: ఒకే ఛార్జ్ తో 902 కి.మీ రేంజ్, వామ్మో ఇదేం టెక్నాలజీ భయ్యా!

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు  

Advertisement

తెలంగాణలో రహదారి ప్రమాదాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 2024లో 25,986, 2025లో 27,352 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2024లో 7,949 మంది. 2025లో 7,545 మంచి ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, మొత్తం ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపడుతున్నారు.

Read Also:  ఒకే ప్లాట్‌ ఫామ్, రెండు బ్రాండ్లు.. బాలెనో vs గ్లాంజా, రెండింటిలో ఏది బెస్ట్?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×