E-Paper
Advertisement

Decoit Adivishesh: సర్ప్రైజ్ లంటూ భజన మాత్రమేనా.. డెకాయిట్ హైప్ పెంచే ప్రయత్నం ఏదైనా ఉందా?

Decoit Adivishesh: సర్ప్రైజ్ లంటూ భజన మాత్రమేనా.. డెకాయిట్ హైప్ పెంచే ప్రయత్నం ఏదైనా ఉందా?
Advertisement

Decoit Adivishesh: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ.. ఆ చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు యంగ్ హీరో అడివి శేష్ (Adivi Shesh). హిట్ 2, గూఢచారి వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన తాజాగా ‘డెకాయిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తొలిసారి తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధం అయిపోయింది.

సర్ప్రైజ్ అంటూ అడివి శేష్ పోస్ట్..

విడుదలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మీకో సర్ప్రైజ్ అంటూ అడివి శేష్ తాజాగా ఒక పోస్ట్ పంచుకున్నారు. ఈ సినిమాలోని తదుపరి సాంగ్ త్వరలోనే విడుదల కాబోతోంది అని చెబుతూ..” ఈ పాటలో నేను మొదటిసారి డాన్స్ చేశాను. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అంటూ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పంచుకున్నారు అడివి శేష్.

భజన మాత్రమేనా? హైప్ పెంచే ప్రయత్నం ఏదైనా ఉందా?

Advertisement

ఇకపోతే అడివి శేష్ ఇలా తన పోస్ట్ పెట్టారో లేదో అటు నెటిజన్స్ అప్పుడే ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. సర్ప్రైజ్ లంటూ ట్విట్టర్లు , ఇంస్టాగ్రామ్ పోస్ట్లతోనే సరిపెడతారా లేక సినిమా పైన హైప్ పెంచే ప్రయత్నం ఏదైనా చేస్తారా అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అడివి శేష్ నటిస్తున్నారు అంటే కచ్చితంగా ఆ సినిమాలపై మంచి అంచనాలు ఉండేవి. కానీ ఈ డెకాయిట్ మూవీపై మొదటి నుంచి ఎలాంటి అంచనాలు లేకపోవడం కొసమెరుపు.. పైగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ కూడా వదలడం లేదు.. అటు ఈ సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం కూడా ఎటువంటి ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. హీరో , హీరోయిన్ అటు చిత్ర బృందం ఎవరూ కూడా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను బయట పెట్టకుండా పోస్టుల ద్వారా సరిపెడుతున్నారు.

ALSO READ:Peddi Movie: పెద్ది – దేవర మూవీలు ఒకటేనా?

ప్రేక్షకుడు థియేటర్ కి రావాలంటే ఆమాత్రం కష్టపడాల్సిందే?

Advertisement

ఈ నేపథ్యంలోనే కనీసం ఇప్పటికైనా సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేసి.. ప్రజలను థియేటర్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? లేక సర్ప్రైజ్ అంటూ పోస్టులతోనే భజన చేస్తారా? అంటూ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఒక సినిమా చూడడానికి ప్రేక్షకుడు థియేటర్ కి రావాలి అంటే కచ్చితంగా సినిమాపై అంచనాలు ఉండాలి. అప్పుడే ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడు.. అసలే ఎటువంటి అంచనాలు లేకుండా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాం అంటే ఇప్పుడున్న రోజుల్లో కష్టమే అనే చెప్పాలి. మరి దీనిపై చిత్ర బృందం పునరాలోచన చేసి ప్రమోషన్స్ వేగవంతం చేయాలని.. సినిమాపై అంచనాలు పెరిగితేనే థియేటర్ కి ఆడియన్స్ వస్తారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇప్పటికైనా సినిమాపై హైప్ పెంచి మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×