E-Paper
Advertisement

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?
Advertisement

Most Expensive Electric Car| ఆటోమొబైల్ రంగంలో అత్యధిక ధర పలికిన ఎలక్ట్రిక్ కార్‌గా ఫెరారీ కొత్త మోడల్ భారీ రికార్డ్ సృష్టించింది. ఇటలీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ ఫెరారీ తన తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుతో చరిత్ర సృష్టించింది. ఫెరారీ లూస్ (Ferrari Luce) అనే స్పెషల్ కారు భారీ ధరకు వేలంలో అమ్ముడైంది. ఈ కారు ఏకంగా 40 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.383 కోట్లకు విక్రయమైనట్లు సమాచారం. ఈ వేలం అమెరికాలోని మాంటెరేలో నిర్వహించిన చారిటీ కార్యక్రమంలో జరిగింది. అయితే, ఇంత భారీ మొత్తం చెల్లించిన కొనుగోలుదారుడు కారును వెంటనే పొందలేరు. ఈ ప్రత్యేక కారు డెలివరీ కోసం 2027 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఫెరారీ లూస్ ఛాసిస్ 0 ఈ కారు అనేది లూస్ మోడల్ ప్రోగ్రామ్‌లోని మొదటి ప్రొడక్షన్ చాసిస్‌గా గుర్తింపు పొందడం మరో ప్రత్యేకత.

వేలం పాటలో రూ.383 కోట్ల రికార్డ్ ధర

ఫెరారీ లూస్ ఛాసిస్ 0 వేలంలో అత్యంత భారీ ధరకు అమ్ముడైన కొత్త ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ కారుకు చారిటీ వేలంలో 40 మిలియన్ డాలర్ల బిడ్ వచ్చింది. వేలం ద్వారా వచ్చిన మొత్తం ఫెరారీ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ నిధులను విద్య, ఇతర సామాజిక కార్యక్రమాలకు వినియోగించడానికి ఫౌండేషన్ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ చారిత్రాత్మక కారును ప్రముఖ అమెరికన్ బిలియనీర్, ఆపిల్ కంపెనీలో ప్రముఖ పార్ట్‌నర్, ఆవిష్కర్త, డాక్టర్ హెర్బర్ట్ వెర్తైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ కారును ఆయన తన అరుదైన కార్ల సేకరణలో చేర్చుకున్నారు. డాక్టర్ హెర్బర్ట్ వద్ద ఇప్పటికీ ఫెరారీ కంపెనీ అన్ని కార్ల మోడల్స్ ఉన్నాయి. ఆయన ఇంత ధర చెల్లించడానికి కారణం చెబుతూ ఇది ఛాసిస్ 0 కారు కావడం వల్లే దీనికి అంత ధర చెల్లిస్తున్నానని తెలిపారు.

కారు డెలివరీ కోసం 2027 వరకు వేచి ఉండాలి

Advertisement

రూ.383 కోట్లకు కారు కొనుగోలు చేసినప్పటికీ వెంటనే డెలివరీ జరగదు. ఈ ప్రత్యేక ఛాసిస్ 0 కారును ఫెరారీ కొంతకాలం ఇటలీలోని మారనెల్లో ప్రధాన కార్యాలయంలో ఉంచనుంది. ఆ తర్వాత 2027 మొదటి త్రైమాసికంలో కొనుగోలుదారుడికి డెలివరీ చేసే అవకాశం ఉంది. సాధారణ ఫెరారీ లూస్ మోడళ్లను ఇతర అర్హత కలిగిన కొనుగోలుదారులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రత్యేక ఛాసిస్ 0 ధర సాధారణ మోడల్ కంటే చాలా ఎక్కువగా ఉండటానికి దాని ప్రత్యేక చారిత్రాత్మక గుర్తింపే ప్రధాన కారణం.

నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో భారీ పవర్

ఫెరారీ లూస్‌లో మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లు కలిపి గరిష్టంగా 1,050 హార్స్‌పవర్, 990Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయని సమాచారం. కారులోని వెనుక మోటార్లు ఎక్కువ పవర్‌ను అందిస్తాయి. ముందు మోటార్లను అవసరం లేని సమయంలో విడదీయగల ప్రత్యేక వ్యవస్థ కూడా ఇందులో ఉంది.

కారులో మూడు డ్రైవింగ్ మోడ్‌లు

Advertisement

రేంజ్ మోడ్‌లో సుమారు 430 హార్స్‌పవర్ అందుతుంది. టూర్ మోడ్‌లో సుమారు 617 హార్స్‌పవర్ లభిస్తుంది. పర్‌ఫామెన్స్ మోడ్‌లో సుమారు 986 హార్స్‌పవర్ వరకు పవర్ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక లాంచ్ కంట్రోల్ ద్వారా గరిష్టంగా 1,050 హార్స్‌పవర్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 2.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం సుమారు గంటకు 310 కిలోమీటర్లు.

Also Read: బ్యాంక్ లాకర్‌ నుంచి రూ.50 లక్షల నగలు చోరీ.. చేతులెత్తేసిన బ్యాంక్.. నష్టపరిహారం ఎవరిస్తారు?

కాంతి స్ఫూర్తితో రూపొందిన ప్రత్యేక డిజైన్

ఈ ప్రత్యేక ఫెరారీ లూస్ కారు.. కంపెనీ టైలర్ మేడ్ కస్టమైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా రూపొందించింది. కారు డిజైన్‌కు లైటింగ్ అనే ప్రత్యేక థీమ్‌ను ఆధారంగా తీసుకున్నారు. దీనికి మాడ్రెపెర్లా సెమీ గ్లోస్ ఫినిష్ ఉండడంతో లైటింగ్ మారినప్పుడు గ్రీన్ , బ్లూ రంగుల మధ్య మారుతుంది.

కారు ఇంటీరియర్‌లో ప్రీమియం పెర్లా లీ మాన్స్ మెటాలిక్ లెదర్ ఉపయోగించారు. సాధారణంగా నలుపు రంగులో ఉండే కొన్ని భాగాలకు గ్రీగియో కోర్‌వారా ఫినిష్ ఇచ్చారు. ప్రత్యేక వీల్స్, కస్టమైజ్డ్ బ్రేక్ కాలిపర్స్, ప్రత్యేక ఫెరారీ లోగో కూడా ఇందులో ఉన్నాయి.

ఛాసిస్ 0 ఎందుకు అంత ప్రత్యేకం?

ఈ కారు ప్రత్యేకతకు ప్రధాన కారణం దాని ఛాసిస్ 0 హోదా. ఫెరారీ లూస్ ప్రోగ్రామ్‌లో ఇది మొదటి ప్రొడక్షన్ చాసిస్‌గా గుర్తింపు పొందింది. అందువల్ల ఈ కారును కొనుగోలు చేసిన వ్యక్తికి ఫెరారీ ఎలక్ట్రిక్ వెహికల్ హిస్టరీలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. అత్యాధునిక ఎలక్ట్రిక్ పనితీరు, ప్రత్యేక డిజైన్ మరియు అరుదైన గుర్తింపు ఈ కారును మరింత విలువైనదిగా మార్చాయి.

Related News

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

టాటా To మారుతి.. త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

27 కి.మీ మైలేజ్, సూపర్ సన్‌ రూఫ్.. మిడిల్ క్లాస్ ఫేవరెట్ టాటా కారు ఇదే!

అదిరిపోయే రేంజ్.. అంతకు మించి ఫీచర్లు.. ఈ 4 మోడళ్లపై ఓ లుక్కేయండి!

డస్టర్ To సెల్టోస్.. ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జోరు!

హీరో ఇంపల్స్ మళ్లీ వస్తుందా? కొత్త పేటెంట్‌ తో చర్చ రచ్చే!

మారుతి కార్ల ధరలు పెంపు, ఆ మోడల్ పై ఏకంగా రూ. 30 వేలు జంప్!

Big Stories

Advertisement
×