E-Paper
Advertisement

కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!

కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!
Advertisement

Upcoming Cars India 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌ లో ఆగస్టు నెల ఎంతో ఆసక్తికరంగా మారబోతోంది. పలు టాప్  కంపెనీలు కొత్త కార్లు, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌ లిఫ్ట్, స్కోడా స్లావియా ఫేస్‌ లిఫ్ట్, అలాగే ఎంజీ 7-సీటర్ PHEV, EV మోడళ్లు విడుదల కానున్నాయి. కొత్త ఫీచర్లు, అప్‌ డేటెడ్ డిజైన్‌ తో ఈ కార్లు కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

1.మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌ లిఫ్ట్

మహీంద్రా  స్కార్పియో ఎన్ ఫేస్‌ లిఫ్ట్‌ ను ఆగస్టు 14, 15 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.13.50 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. కొత్త మోడల్‌ లో ఫ్రంట్ గ్రిల్, బంపర్లు, అల్లాయ్ వీల్స్ డిజైన్‌ లో మార్పులు కనిపిస్తాయి. ఇంటీరియర్‌ లో మాత్రం పెద్ద అప్‌ గ్రేడ్‌ లు ఉండనున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లేలు, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డాల్బీ అట్మోస్‌ తో హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ ఎంపికల్లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లు కొనసాగనున్నాయి. అలాగే 4WD ఆప్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

2.స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్

Advertisement

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ ను ఆగస్టు 18న విడుదల చేయనుంది. దీని అంచనా ధర రూ.10 లక్షల నుంచి రూ.18.50 లక్షల వరకు ఉండవచ్చు. ఈ సెడాన్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, సవరించిన బంపర్లు, కొత్త LED లైట్లు లాంటి చిన్న డిజైన్ మార్పులు ఉంటాయి. క్యాబిన్‌ లో కొత్త అప్‌హోల్స్టరీ, పనోరమిక్ సన్‌రూఫ్, వెనుక సీట్లకు మసాజ్ ఫంక్షన్ లాంటి ప్రీమియం ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 1.0 లీటర్ ఇంజిన్‌కు ప్రస్తుతం ఉన్న 6 స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వచ్చే అవకాశం ఉంది.

3.ఎంజీ 7-సీటర్ PHEV, EV

ఆగస్టు నెలాఖరులో ఎంజీ మోటార్ కూడా రెండు కొత్త 7 సీటర్ మోడళ్లను తీసుకురానుంది. ఇందులో ఒకటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్   కాగా, మరొకటి పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్‌ గా రానుంది. ఈ రెండు వాహనాలతో ప్రీమియం SUV సెగ్మెంట్‌ లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని ఎంజీ భావిస్తోంది.

Advertisement

ఆగస్టు 2026లో భారత కార్ల మార్కెట్‌లో వరుస లాంచ్‌లు జరగనున్నాయి. SUV కావాలనుకునే వారికి స్కార్పియో-ఎన్, సెడాన్ కోరుకునేవారికి స్లావియా, ఎలక్ట్రిఫైడ్ 7 సీటర్ వాహనం కోసం ఎదురు చూస్తున్న వారికి MG కొత్త మోడళ్లు మంచి ఆప్షన్ కానున్నాయి.

Read Also: నిస్సాన్ టెక్టన్, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు స్టార్ట్.. కస్టమర్లకు తాళాలు అందజేత!

Related News

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

Big Stories

Advertisement
×