E-Paper
Advertisement

హ్యుందాయ్ నవంబర్ ఆఫర్లు వచ్చేశాయ్.. క్రెటాపై ఏకంగా రూ.1.20 లక్షల డిస్కౌంట్!

హ్యుందాయ్ నవంబర్ ఆఫర్లు వచ్చేశాయ్.. క్రెటాపై ఏకంగా రూ.1.20 లక్షల డిస్కౌంట్!
Advertisement

Hyundai Discounts November 2026: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, హ్యుందాయ్ కంపెనీ మీ కోసమే గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 2026 నెలలో తన కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా పాపులర్ SUV క్రెటాపై ఏకంగా రూ.1.20 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. క్రెటాతో పాటు వెర్నా, అల్కాజర్, ఐ20, ఎక్స్టర్, గ్రాండ్ ఐ10 నియోస్ లాంటి మోడళ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

క్రెటాపై భారీ డిస్కౌంట్

నవంబర్ నెలలో హ్యుందాయ్ క్రెటా N లైన్‌పై గరిష్టంగా రూ.1.20 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, దీపావళి బోనస్, ఎక్స్ఛేంజ్, అప్‌గ్రేడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్రెటా పెట్రోల్ వేరియంట్లపై రూ.1.10 లక్షల వరకు ఆఫర్ ఉంది. పెట్రోల్ CVT మోడళ్లపై రూ.1 లక్ష వరకు, బేస్ వేరియంట్‌పై రూ.95 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

వెర్నా, అల్కాజర్‌పైనా ఆఫర్లు

Advertisement

హ్యుందాయ్ వెర్నా CVT పాత స్టాక్‌పై రూ.1.05 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త HX8 DCT వేరియంట్‌పై రూ.85 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర కొత్త వేరియంట్లపై రూ.75 వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. మరోవైపు అల్కాజర్ పెట్రోల్ వేరియంట్లపై రూ.90 వేల వరకు, డీజిల్ మోడళ్లపై రూ.45 వేల వరకు తగ్గింపులు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ క్రెటాపై రూ.80 వేల బెనిఫిట్స్

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి కూడా హ్యుందాయ్ ఆఫర్లు ప్రకటించింది. క్రెటా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన లాంగ్ రేంజ్ వేరియంట్లపై రూ.80 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర వేరియంట్లపై రూ.50 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్‌పై తగ్గింపు

Advertisement

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్లపై రూ.73 వేల వరకు, CNG మోడళ్లపై రూ.68 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఐ20, ఐ20 N లైన్ మోడళ్లపై రూ.63 వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.

ఎక్స్టర్, ఆరా, వెన్యూపై ఎంత తగ్గింపు అంటే?

పాత ఎక్స్టర్ మోడళ్లపై రూ.53 వేల వరకు, కొత్త ఎక్స్టర్ ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.45 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. హ్యుందాయ్ ఆరా CNG మోడళ్లపై రూ.35 వేల వరకు, పెట్రోల్ వేరియంట్లపై రూ.20 వేల వరకు ఆఫర్లు లభిస్తాయి. అయితే, వెన్యూ, వెన్యూ N లైన్ మోడళ్లపై మాత్రం రూ.5 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్ బేయాన్‌పై కూడా రూ.5 వేల స్క్రాపేజ్ తగ్గింపు ప్రకటించింది.

కొనుగోలు చేసే ముందు ఈ విషయం తెలుసుకోండి!

ఈ డిస్కౌంట్లు సిటీ, డీలర్, వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి మారనున్నాయి. అలాగే కొన్నిబెనిఫిట్స్ ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ చేసే వారికి మాత్రమే వర్తిస్తాయి. సో, కారు కొనుగోలు చేసే ముందు సమీపంలోని హ్యుందాయ్ షోరూమ్‌ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

Read Also: BYD సంచలనం.. ఈ కారు రోడ్లపైనే కాదు.. నీళ్లలోనూ దూసుకెళ్తుంది!

Tags

Related News

హోండా రెంబల్ 300 బుక్ చేసుకున్నవారికి గుడ్‌న్యూస్.. డెలివరీలు ఎప్పటి నుంచి అంటే?

ఇన్నోవా క్రిస్టా ధరలు పెరిగాయి.. ఏ వేరియంట్‌పై ఎంతంటే?

నార్టన్ కొత్త రోడ్‌స్టర్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

BYD సంచలనం.. ఈ కారు రోడ్లపైనే కాదు.. నీళ్లలోనూ దూసుకెళ్తుంది!

సఫారీ EV To అవిన్య X.. టాటా నుంచి రాబోతున్న 4 క్రేజీ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

భారత్‌ లోకి బేబీ ల్యాండ్ క్రూయిజర్ ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

క్లాసిక్ 650 స్పెషల్ ఎడిషన్ కు కళ్లు చెదిరే డిమాండ్, జస్ట్ 6 నిమిషాల్లోనే అన్నీ సేల్!

Big Stories

Advertisement
×