E-Paper
Advertisement

Best EV scooter: జస్ట్ రూ.33 వేలకే.. ముగ్గురు హ్యాపీగా వెళ్లే ఈవీ స్కూటర్!

Best EV scooter: జస్ట్ రూ.33 వేలకే.. ముగ్గురు హ్యాపీగా వెళ్లే ఈవీ స్కూటర్!
Advertisement

Best Customized EV Scooter: దేశీ మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ఖర్చులో మంచి రేంజ్ అందించే స్కూటర్లు అడుగు పెడుతున్నాయి. రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉండాలని వినియోగదారులు భావిస్తున్నారు. మరికొంత మంది తక్కువ ధరకే కంఫర్ట్ గా వెళ్లే ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు కేవలం రూ. 33, 999 రూపాయలకే ముగ్గురు హ్యాపీగా వెళ్లే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్ లో ముందు సీటులో కూర్చొని ఓ వ్యక్తి నడిపేలా, మరో ఇద్దరు వెనుక కూర్చునేలా రూపొందించారు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే..

ఈ స్కూటర్ కు మూడు వీల్స్ ఉంటాయి. ముందు ఒక సీటు, వెనుక ఇద్దరు కూర్చునేలా పెద్ద సీటు ఉంటుంది. ముందు సీటు వెనక్కి మడిచి చక్కగా పడుకోవచ్చు కూడా. ముందు సీటును ముందుకు, వెనక్కి అడ్జెస్ట్ కూడా చేసుకోవచ్చు. చక్కగా చేతులు పెట్టుకునేలా హ్యాండ్ రెస్ట్ లు కూడా ఉంటాయి. వెనక్కి ఆనుకుని కంఫర్ట్ గా కూర్చునేలా బ్యాక్ రెస్ట్ కూడా ఉంటుంది. వెనుక కూర్చుని వెళ్తుండే మహారాజా ఫీల్ కావచ్చు.

ఒక్క ఛార్జ్ తో 80 కిలో మీటర్ల ప్రయాణం

Advertisement

ఇక ఈ స్కూటర్ లో మూడు స్పీడ్ మోడ్స్ ఉంటాయి. రివర్స్ కూడా అవకాశం ఉంటుంది. రిమోట్ తోనూ ఆపరేట్ చేసే అవకాశం ఉంది. వెనుక సీట్ కింద మంచి బూట్ స్పేస్ ఉంటుంది. ఈ స్కూటర్ కు ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ఈ స్కూటర్ కు పూర్తి ఛార్జింగ్ చేసేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఒక్క ఛార్జ్ తో ఏకంగా 80 కిలో మీటర్ల రేంజ్ లభిస్తుంది.

Advertisement

Read Also: ఇండియాలో టాప్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే, ఒక్కోటి ఎంత దూరం వెళ్తాయంటే?

నో రిజిస్ట్రేషన్, నో లైసెస్..

ఇక ఈ స్కూటర్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. లైసెన్స్ లేకుండానే నడిపే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ కు ఏడాది గ్యారెంటీ ఉంటుంది. బ్యాటరీకి మూడు సంవత్సరాల వ్యారింటీ ఉంటుంది. ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర కేవలం రూ. 33,999గా నిర్ణయించారు.

Read Also: సరుకులు తీసుకెళ్లొచ్చు, లాంగ్ ట్రిప్ ఎంజాయ్ చెయ్యొచ్చు.. హోండా ఎలక్ట్రిక్ వ్యాన్ భలే ఉంది గురూ!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×