E-Paper
Advertisement

ఇంట్లో దోమలు ఉన్నాయా? కాయిల్స్ vs ఎలక్ట్రిక్ వేపరైజర్లలో.. ఏది బెస్ట్ చాయిస్?

ఇంట్లో దోమలు ఉన్నాయా? కాయిల్స్ vs ఎలక్ట్రిక్ వేపరైజర్లలో.. ఏది బెస్ట్ చాయిస్?
Advertisement

Mosquito Coils vs Electric Vaporizers: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమల బెడద తీవ్రమవుతుంది. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులూ ఈ కాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే దోమల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో ప్రధానంగా రెండు వస్తువులు లభిస్తున్నాయి. అందులో ఒకటి దోమల కాయిల్స్ (Mosquito Coils) కాగా, రెండోది ఎలక్ట్రిక్ లిక్విడ్ వేపరైజర్స్ (Electric Vaporizers). అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి సురక్షితం? ఏది దోమలను సమర్థవంతంగా తరిమికొడుతుంది? వంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దోమల కాయిల్స్ ఎలా పనిచేస్తాయి?

దోమల కాయిల్స్ అనేవి శతాబ్దాలుగా వాడుకలో ఉన్న సాంప్రదాయ పద్ధతి. ఇవి పైరెత్రిన్ లేదా కృత్రిమ పైరెథ్రాయిడ్ వంటి రసాయనాలతో తయారవుతాయి. కాయిల్‌ను వెలిగించినప్పుడు వచ్చే పొగ చుట్టుపక్కల వ్యాపించి దోమలను చంపడం, పారిపోయేలా చేయండ చేస్తుంది. అయితే, ఈ కాయిల్స్ నుండి వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పీఎం 2.5 వంటి ప్రమాదకర సూక్ష్మ కణాలు విడుదలవుతాయి. మూసి ఉన్న గదిలో ఒక కాయిల్ కాల్చడం వల్ల సుమారు 75 నుండి 137 సిగరెట్లు తాగినంత నష్టం ఊపిరితిత్తులకు జరుగుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వేపరైజర్స్ సంగతేంటి?

Advertisement

ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లోనూ ఎలక్ట్రిక్ వేపరైజర్ కనిపిస్తోంది. ఇందులో ఒక చిన్న యంత్రానికి లిక్విడ్ రీఫిల్ బాటిల్‌ను అమర్చి ప్లగ్‌కు కనెక్ట్ చేస్తారు. ఈ పరికరం హీట్ అయినప్పుడు అందులోని ద్రవం ఆవిరిగా మారి గది మొత్తం వ్యాపిస్తుంది. ఈ ఆవిరి దోమల నాడీ వ్యవస్థను దెబ్బతీసి వాటిని మత్తులోకి దించుతాయి. తద్వారా అవి గదిలో తిరగకుండా మిన్నకుండిపోతాయి. అయితే కాయిల్స్‌తో పోలిస్తే ఇందులో పొగ రాకపోవడం ఒక పెద్ద సానుకూల అంశంగా చెప్పవచ్చు.

దోమలపై దేని ప్రభావమెంత?

దోమలను తరిమికొట్టే సామర్థ్యంలో రెండు కూడా దాదాపు సమానంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గాలి ప్రసరణ ఎక్కువగా ఉండే బాల్కనీలు, వరండాలు, విద్యుత్ సౌకర్యం లేని ప్రదేశాలలో దోమల కాయిల్స్ బాగా పనిచేస్తాయని పేర్కొంటున్నారు. అటు బెడ్‌రూమ్‌లు, హాల్ వంటి ఇళ్ల లోపలి భాగాలలో వేపరైజర్లు అత్యంత అనుకూలమైనవని స్పష్టం చేస్తున్నారు. వేపరైజర్లు పొగను విడుదల చేయదు కాబట్టి గదిలో ఊపిరాడకుండా ఉండే సమస్య ఉండదని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: ఇంట్లోని ఏసీ సోలార్‌పై నడవాలంటే.. ఎన్ని ప్యానెళ్లు అవసరం? ఇదే అసలైన లెక్క!

ఆరోగ్యపరంగా చూస్తే..

ప్రభావం పరంగా చూస్తే వేపరైజర్ సురక్షితంగా అనిపించినప్పటికీ, రెండు పద్ధతుల్లోనూ రసాయనాలను వాడతారనే విషయాన్ని మరువకూడదు. కాయిల్స్ వల్ల ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ఎలక్ట్రిక్ వేపరైజర్ల వల్ల కొందరికి తలనొప్పి, అలర్జీలు రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి. దోమల నుంచి రక్షణ కోసం కిటికీలకు నెట్లు అమర్చుకోవడం లేదా దోమతెరలు ఉపయోగించడం అన్నింటికన్నా సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన మార్గం. రసాయనాలు వాడాల్సి వస్తే, ఆ గదిలో తగినంత గాలి వెలుతురు ఉండేలా చూసుకోవడం మంచిది.

Also Read: కరెంట్ ఉండదు.. బ్యాటరీతో పనిలేదు.. కానీ ఈ ‘మాయా దీపాలు’ ఎలా వెలుగుతాయి?

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×