E-Paper
Advertisement

పెట్రోల్ స్కూటర్లకు షాక్.. అమ్మకాల్లో ఈవీ స్కూటర్ల జోరు, నంబర్ వన్ ఏదంటే?

పెట్రోల్ స్కూటర్లకు షాక్.. అమ్మకాల్లో ఈవీ స్కూటర్ల జోరు, నంబర్ వన్ ఏదంటే?
Advertisement

Electric Scooter Sales July 2026: భారత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. జూలై 2026లో  ఈ స్కూటర్లు మంచి సత్తా చాటాయి. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా, హీరో విడా లాంటి మోడళ్లు మార్కెట్‌ లో దుమ్మురేపాయి. జూలైలో అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు కలిపి 1,68,743 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. గత ఏడాది జూలైలో ఇదే మోడళ్లు 63,010 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో ఏడాది వ్యవధిలో అమ్మకాలు ఏకంగా 168 శాతం పెరిగాయి.

టీవీఎస్ ఐక్యూబ్ నంబర్ వన్

జూలై నెలలో టీవీఎస్ ఐక్యూబ్ మరోసారి అమ్మకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మోడల్ 59,386 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది జూలైలో 23,029 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు 158 శాతం పెరిగాయి. జూన్‌లో అమ్మిన 47,331 యూనిట్లతో పోలిస్తే కూడా ఐక్యూబ్ అమ్మకాలు 25 శాతం పెరిగాయి.

చేతక్‌కు మంచి డిమాండ్

Advertisement

బజాజ్ చేతక్ ఈ నెలలో రెండో స్థానంలో నిలిచింది. జూలైలో 47,184 యూనిట్ల చేతక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో కేవలం 11,584 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో అమ్మకాలు 307 శాతం పెరిగాయి. జూన్‌లో 40,376 యూనిట్లతో పోలిస్తే నెలవారీగా కూడా చేతక్ 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. టీవీఎస్ ఐక్యూబ్‌తో కలిసి చేతక్ 1.06 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలను సాధించింది.

జోరులోనే రిజ్టా, విడా

ఏథర్ రిజ్టా 24,833 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది జూలైలో 11,345 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో రిజ్టా అమ్మకాలు 119 శాతం పెరిగాయి. హీరో విడా కూడా 22,707 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో ఉంది. గత ఏడాది 11,225 యూనిట్లతో పోలిస్తే ఈసారి 102 శాతం వృద్ధి సాధించింది. జూన్‌తో పోల్చినా అమ్మకాలు 11 శాతం పెరిగాయి.

రివర్ ఇండీకి మంచి స్పందన

Advertisement

పెద్ద కంపెనీలతో పాటు కొత్త ఈవీ బ్రాండ్లు కూడా మార్కెట్‌లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. రివర్ ఇండీ జూలైలో 6,039 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 1,853 యూనిట్లతో పోలిస్తే ఇది 226 శాతం వృద్ధి సాధించింది.  ఏథర్ 450 సిరీస్ 6,211 యూనిట్లు విక్రయించింది. అయితే, జూన్‌తో పోలిస్తే రెండు శాతం స్వల్ప తగ్గుదల కనిపించింది.

టాప్ నాలుగు మోడళ్లదే 91 శాతం వాటా!

జూలై అమ్మకాలలో టాప్ నాలుగు మోడళ్లు టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా, హీరో విడా కలిసి 1,54,110 యూనిట్లను అమ్మాయి. అంటే మొత్తం 1,68,743 యూనిట్లలో దాదాపు 91 శాతం అమ్మకాలు ఈ నాలుగు మోడళ్ల నుంచే వచ్చాయి.

Read Also: యాక్సర్ నుంచి కాస్ట్లీ హెల్మెట్ లాంఛ్, ధర ఎంతో తెలుసా?

Tags

Related News

కొనుగోలుదారులకు టాటా బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంపు!

కారు విండోకి తెల్లటి గుడ్డ.. ఇది దేనికి సంకేతం? ఒకవేళ కనిపిస్తే ఏం చేయాలి?

బ్రెజిల్‌ లో E32 ఫ్యూయెల్ వాడుతున్నారు.. మరి భారత్‌లో E20పై ఎందుకింత భయం?

యాక్సర్ నుంచి కాస్ట్లీ హెల్మెట్ లాంఛ్, ధర ఎంతో తెలుసా?

సింగిల్ ఛార్జ్ తో 520 కి.మీ రేంజ్.. BYD క్రేజీ సీలయన్ 7 వచ్చేసింది!

లగ్జరీ కార్లే టార్గెట్.. వీళ్లు కొట్టేసే ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

హ్యుందాయ్ మళ్లీ బాదుడు.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?

Big Stories

Advertisement
×