E-Paper
Advertisement

యాక్సర్ నుంచి కాస్ట్లీ హెల్మెట్ లాంఛ్, ధర ఎంతో తెలుసా?

యాక్సర్ నుంచి కాస్ట్లీ హెల్మెట్ లాంఛ్, ధర ఎంతో తెలుసా?
Advertisement

Axor MX Carbon Helmet Launched: ఇండియన్ రైడింగ్ గేర్ తయారీ సంస్థ యాక్సర్ తన అప్‌డేటెడ్ MX కార్బన్ హెల్మెట్‌ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తక్కువ బరువు, సూపర్ షెల్ నిర్మాణం, మూడు ఇంటర్నేషనల్ సేఫ్టీ సర్టిఫికేషన్లతో ఈ కొత్త హెల్మెట్‌ ను  తయారు చేసింది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్‌ కు అందుబాటులో ఉంది. దీని ధర రూ.20,060గా కంపెనీ నిర్ణయించింది. యాక్సర్ ఇప్పటి వరకు తీసుకొచ్చిన హెల్మెట్లలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్‌ కావడం విశేషం.

కొత్త షెల్ టెక్నాలజీతో తయారీ

పాత MX కార్బన్ మోడల్‌ తో పోలిస్తే కొత్త హెల్మెట్‌లో షెల్ టెక్నాలజీని మరింత అప్ డేట్ చేసినట్లు యాక్సర్ తెలిపింది. బరువు తగ్గించడంతో పాటు అవసరమైన బలాన్ని అందించేందుకు ట్రై కంపోజిట్ నిర్మాణాన్ని ఉపయోగించారు. ఈ షెల్‌లో 3K కార్బన్ ఫైబర్, అరామిడ్ ఫైబర్, ఏరోస్పేస్ గ్రేడ్ ఫైబర్‌గ్లాస్ అనే మూడు రకాల పదార్థాలను ఉపయోగించారు. ఈ ప్రత్యేక నిర్మాణం వల్ల హెల్మెట్ బరువు తక్కువగా ఉండటంతో పాటు బలంగా కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆఫ్ రోడ్,  మోటోక్రాస్ రైడింగ్ చేసే వారికి తక్కువ బరువు ఉన్న హెల్మెట్ బాగుంటుంది. ఎక్కువసేపు హెల్మెట్ ధరించినప్పుడు మెడపై పడే ఒత్తిడిని తగ్గించడంలో తేలికైన హెల్మెట్ సాయపడుతుంది.

కేవలం 1.04 కిలోల బరువు

Advertisement

కొత్త యాక్సర్ MX కార్బన్ హెల్మెట్ హైలెట్ దాని బరువు. సైజును బట్టి దీని బరువు సుమారు 1,040 గ్రాములు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో దాదాపు 50 గ్రాముల వరకు తేడా ఉండవచ్చు. మూడు వేర్వేరు షెల్ సైజులలో ఈ హెల్మెట్‌ను తయారు చేస్తున్నారు. అయితే కస్టమర్ల కోసం M, L, XL, 2XL అనే నాలుగు సైజులు అందుబాటులో ఉన్నాయి.

మూడు కీలక సేఫ్టీ సర్టిఫికేషన్లు

ఈ హెల్మెట్‌కు ECE 22.06, ISI, DOT సర్టిఫికేషన్లు లభించాయి. ఈ మూడు సర్టిఫికేషన్లు ఉండటం దీని ప్రత్యేకతల్లో ఒకటిగా యాక్సర్ చెబుతోంది. ECE 22.06 ప్రస్తుత ద్రతా ప్రమాణాల్లో ఒకటి కాగా, ISI సర్టిఫికేషన్ భారత మార్కెట్‌కు అవసరమైన ప్రమాణాలను సూచిస్తుంది. DOT సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉంది. ఈ కారణంగా దీనిని ట్రిపుల్ సర్టిఫైడ్ హెల్మెట్‌గా కంపెనీ ప్రచారం చేస్తోంది.

ఇతర హెల్మెట్లతో పోలిస్తే ఎలా ఉంది?

Advertisement

ఈ ధర పరిధిలో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆఫ్ రోడ్ హెల్మెట్లలో KYT Skyhawk ప్రత్యామ్నాయంగా ఉంది. దీని బరువు సుమారు 1,200 గ్రాములు కాగా, ధర సుమారు రూ.27,000. అయితే, యాక్సర్ MX కార్బన్ బరువు దానికంటే తక్కువగా ఉంది. ధర కూడా తక్కువగా ఉండటం వల్ల ప్రీమియం ఆఫ్ రోడ్ హెల్మెట్ కొనాలనుకునే వారికి ఇది మరో ఆప్షన్ కానుంది.

ప్రీ ఆర్డర్లు ప్రారంభం

యాక్సర్ MX కార్బన్ హెల్మెట్‌ను భారత్ లోనే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. రూ.20,060 ధరతో యాక్సర్ అధికారికంగా బుకింగ్ అవకాశాన్ని అందిస్తోంది. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది.

Read Also: హ్యుందాయ్ మళ్లీ బాదుడు.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?

Tags

Related News

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×