E-Paper
Advertisement

కొనుగోలుదారులకు టాటా బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంపు!

కొనుగోలుదారులకు టాటా బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంపు!
Advertisement

Tata Cars Price Hike: టాటా మోటార్స్ కార్లు కొనాలని చూస్తున్న వారికి అలర్ట్. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ కార్ల ధరలను పెంచబోతోంది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.25,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇప్పటికే కార్ల తయారీ సంస్థలపై ముడిసరుకు ధరలు, ద్రవ్యోల్బణం లాంటి అంశాల ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టాటా ధరలను సవరిస్తున్నట్లు ప్రకటించింది.

ధరలు పెంచడానికి కారణాలేంటి?

ప్రస్తుతం ముడిసరుకు ఖర్చులు పెరుగుతున్నాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా వాహనాల తయారీ ఖర్చులపై పడుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీల ధరలు గత కొన్ని నెలల్లో సుమారు 10 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈవీ మోడళ్లపై ఖర్చుల భారం మరింత పెరిగింది. దీనికి తోడు విదేశీ మారకపు విలువల్లో మార్పులు, ఉద్యోగుల తొలగింపు, సంబంధిత ఖర్చులు కూడా కంపెనీపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. ఇవన్నీ కలిపి ధరల పెంపు నిర్ణయానికి కారణమయ్యాయని టాటా మోటార్స్ తెలిపింది.

ఈవీలు, పెట్రోల్ కార్లపై ప్రభావం

Advertisement

సెప్టెంబర్‌లో టాటా మోటార్స్ పెంచబోయే ధరలు కేవలం ఎలక్ట్రిక్ కార్లకే పరిమితం కావు. ఎంపిక చేసిన ఈవీ, ఐసీఈ మోడళ్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఏ మోడల్‌పై ఎంత ధర పెరుగుతుందనే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. టాటా ఎస్‌యూవీ లైనప్‌లోని కొన్ని మోడళ్లకు కూడా ధరల పెంపు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం టాటా కార్ల ధరలు

ఆగస్టు 2026లో టాటా కార్ల ఎక్స్-షోరూమ్ ధరలను పరిశీలిస్తే.. టియాగో ధర రూ.4.70 లక్షల నుంచి రూ.8.55 లక్షల వరకు ఉంది. టిగోర్ ధర రూ.5.55 లక్షల నుంచి రూ.8.84 లక్షల మధ్యలో ఉండగా, ఆల్ట్రోజ్ ధర రూ.6.30 లక్షల నుంచి రూ.10.77 లక్షల వరకు ఉంది. పంచ్ ధర రూ.5.70 లక్షల నుంచి రూ.10.67 లక్షల వరకు ఉంది. నెక్సాన్ ధర రూ.7.40 లక్షల నుంచి రూ.14.10 లక్షల మధ్యలో ఉంది. కర్వ్ ధర రూ.9.76 లక్షల నుంచి రూ.18.96 లక్షల వరకు ఉండగా, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన సియెర్రా ధర రూ.11.49 లక్షల నుంచి రూ.21.29 లక్షల వరకు ఉంది.

టాటా ఈవీల ధరలు

Advertisement

టియాగో ఈవీ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంది. టిగోర్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల మధ్యలో ఉంది. పంచ్ ఈవీ రూ.9.69 లక్షల నుంచి రూ.12.79 లక్షల వరకు లభిస్తోంది. నెక్సాన్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉంది. కర్వ్ ఈవీ ధర రూ.16.99 లక్షల నుంచి రూ.21.99 లక్షల వరకు ఉండగా, సియెర్రా ఈవీ ధర రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల మధ్యలో ఉంది. హారియర్ ధర రూ.13 లక్షల నుంచి రూ.25.40 లక్షల వరకు ఉండగా, దాని ఈవీ వెర్షన్ రూ.21.69 లక్షల నుంచి రూ.29.19 లక్షల వరకు ఉంది. సఫారి ధర రూ.13.40 లక్షల నుంచి రూ.26.15 లక్షల వరకు ఉంది.

Read Also:పెట్రోల్ స్కూటర్లకు షాక్.. అమ్మకాల్లో ఈవీ స్కూటర్ల జోరు, నంబర్ వన్ ఏదంటే?

Tags

Related News

కొత్త కార్లు, బైక్‌లకు పేర్లు ఎలా పెడతారు? బాబోయ్.. ఇంత ప్రాపెస్ ఉంటుందా?

బైక్‌లలో 100cc, 125cc, 150cc అంటే ఏంటి? ఇంజిన్ వెనుక అసలు లెక్క ఇదే!

కార్ల స్పీడోమీటర్‌లో 220, 240, 260 వరకు స్పీడ్ ఎందుకు ఉంటుంది? మన రోడ్లపై అంత వేగం సాధ్యమేనా?

వైరల్ వీడియో.. బైక్ పెట్రోల్ ట్యాంకులకు రంథ్రాలు చేసి.. ఇదేం ట్రెండు?

క్లచ్ పట్టకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. హోండా కొత్త బైక్ వచ్చేసింది!

రిలీజ్ కు ముందే కాంబాట్ SUV ఫొటోలు లీక్.. ఫీచర్లు, రేంజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

పల్సర్ NS125లో అదిరిపోయే అప్‌డేట్.. ఇక బైక్ స్క్రీన్‌పైనే గూగుల్ మ్యాప్స్!

టీవీఎస్ నుంచి మరో బైక్ అవుట్.. 12 ఏళ్ల తర్వాత స్టార్ సిటీ ప్లస్‌కు గుడ్‌బై!

Big Stories

Advertisement
×