KTR: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థులపై పోలీసుల దమనకాండ ఢిల్లీలో జరిగినా, తెలంగాణలో జరిగినా ఒకే విధంగా ఖండించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా? తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సీఎం జూబ్లీహిల్స్ నివాసం ఎదుట ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలనిడిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ప్రశ్నిస్తూ బాధిత విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు నాటకాలు ఆడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి, వారిని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కి చంపేందుకు దాడులకు పాల్పడుతున్న ఘటనలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు.
‘ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై చేసిన దాష్టీకానికి వ్యతిరేకంగా ఎప్పుడు ధర్నా చేస్తారు?’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నా, వారిని ఈడ్చుకెళ్తున్నా, వారి హక్కులను అణచివేస్తున్నా రాహుల్ గాంధీ స్పందించకపోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. ఇక్కడ విద్యార్థులను చావగొడుతున్న పోలీస్ లాఠీలపై కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉన్నందుకే…రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను తీవ్రంగా ఖండిస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను కూడా ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ని డిమాండ్ చేయాలని అన్నారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకు అతీతంగా నిలబడతారా? లేక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని రాహుల్ గాంధీనిప్రశ్నించారు.
ఢిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో ఇంకొక్క నీతా?
‘ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయాలి. అంతేకానీ విద్యార్థుల పట్ల ద్వందనీతి సరైనది కాదు.. తెలంగాణ విద్యార్థులపై జరుగుతున్న దాస్టికంపై స్పందించకుంటే విద్యార్థులపై మీది కపట ప్రేమ మాత్రమే’ అని తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు.తెలంగాణలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులపై రాహుల్ గాంధీ స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ఢిల్లీలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం.. అదే హక్కులు తెలంగాణ విద్యార్థులకు కూడా ఉన్నాయని గుర్తించాలని సూచించారు.
Also Read: జగిత్యాల కలెక్టరేట్‌లో పొంగులేటి సమీక్ష.. తహసీల్దార్ సస్పెన్షన్, ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు!