E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్ తో 520 కి.మీ రేంజ్.. BYD క్రేజీ సీలయన్ 7 వచ్చేసింది!

సింగిల్ ఛార్జ్ తో 520 కి.మీ రేంజ్..  BYD క్రేజీ సీలయన్ 7 వచ్చేసింది!
Advertisement

BYD Sealion 7 Dynamic Launched: BYD ఇండియా తన ఎలక్ట్రిక్ SUV సీలయన్ 7లో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘డైనమిక్’ పేరుతో వచ్చిన ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.41.90 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటి వరకు BYD సీలయన్ 7లో ప్రీమియం, పెర్ఫార్మెన్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త డైనమిక్ వేరియంట్‌ తో ఈ ఎలక్ట్రిక్ SUVను కొంత తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు లభించింది.

చిన్న బ్యాటరీతో కొత్త వేరియంట్

కొత్త BYD సీలయన్ 7 డైనమిక్ వేరియంట్‌లో 71.8kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇప్పటికే ఉన్న ప్రీమియం, పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో 82.56kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 71.8kWh బ్యాటరీతో కూడిన కొత్త వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్ల వరకు NEDC రేంజ్ అందిస్తుందని BYD వెల్లడించింది. పనితీరు పరంగా ఆకట్టుకుంటుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.3 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

ఆకట్టుకునేలా లేటెస్ట్ ఫీచర్లు  

Advertisement

ధర తక్కువగా ఉన్నప్పటికీ డైనమిక్ వేరియంట్‌ లో ఫీచర్ల విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఇందులో పనోరమిక్ గ్లాస్ రూఫ్, వన్-టచ్ ఓపెన్/క్లోజ్ టెయిల్‌ గేట్,  హీటెడ్, ఫోల్డింగ్ ఎక్స్‌ టీరియర్ మిర్రర్స్ ఉన్నాయి. యాంటీ ట్రాప్ ఫీచర్‌ తో ఆటోమేటిక్ విండోస్, రియర్ విండ్‌ స్క్రీన్‌కు ఎలక్ట్రిక్ హీటింగ్, డీఫ్రాస్టింగ్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. క్యాబిన్‌లో 15.6 అంగుళాల రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఆకట్టుకుంటుంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ ఉన్నాయి. 10 స్పీకర్ ఆడియో సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, PM2.5 ఫిల్టర్ లాంటి ఫీచర్లు కూడా అందించారు.

భద్రతలోనూ తగ్గేదే లే!  

భద్రత విషయంలో కూడా BYD సీలయన్ 7 డైనమిక్ వేరియంట్‌ లో ఫీచర్లకు కొదవ లేదు. ఇందులో 11 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, EBD, హిల్ హోల్డ్ కంట్రోల్, ఆటో హోల్డ్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి ఫీచర్లతో లెవెల్ 2 ADAS కూడా ఉంది. కొత్త వేరియంట్‌తో పాటు BYD పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించింది. కస్టమర్లకు ఇన్‌ స్టాలేషన్‌తో పాటు 7kWh హోమ్ ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా, 10 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజీ, బ్యాటరీపై 10 సంవత్సరాలు లేదంటే 1.5 లక్షల కిలోమీటర్ల వరకు ఎక్స్ టెండెడ్ వారంటీని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.41.90 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన కొత్త డైనమిక్ వేరియంట్ ద్వారా BYD సీలయన్ 7ను మరింత మంది కస్టమర్లకు దగ్గర చేయాలని BYD భావిస్తోంది.

Advertisement

Read Also: హ్యుందాయ్ మళ్లీ బాదుడు.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?

Tags

Related News

యాక్సర్ నుంచి కాస్ట్లీ హెల్మెట్ లాంఛ్, ధర ఎంతో తెలుసా?

లగ్జరీ కార్లే టార్గెట్.. వీళ్లు కొట్టేసే ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

హ్యుందాయ్ మళ్లీ బాదుడు.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?

సింగిల్ ఛార్జ్ తో 679 కిమీ రేంజ్.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా XEV 9S!

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×