E-Paper
Advertisement

చక్రాల్లోనే మోటార్లు.. సైన్స్ ఫిక్షన్ లాంటి బైక్.. హోండా ఈవీ డిజైన్ కు ప్రపంచం ఫిదా!

చక్రాల్లోనే మోటార్లు.. సైన్స్ ఫిక్షన్ లాంటి బైక్.. హోండా ఈవీ డిజైన్ కు ప్రపంచం ఫిదా!
Advertisement

Honda EV Outlier Red Dot Award:  హోండా రూపొందించిన సూపర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ఈవీ అవుట్‌ లియర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఫ్యూచరిస్టిక్ తరహా డిజైన్, వీల్స్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లు, సరికొత్త రైడింగ్ కాన్సెప్ట్‌ తో ఆకట్టుకున్న ఈ బైక్‌కు 2026 రెడ్ డాట్ డిజైన్ అవార్డు లభించింది. డిజైన్ కాన్సెప్ట్ విభాగంలో ఈ అరుదైన గౌరవం దక్కింది.

ఏడాదిలోపే ప్రతిష్టాత్మక అవార్డు

హోండా ఈ ఈవీ అవుట్‌ లియర్ కాన్సెప్ట్‌ ను 2025 అక్టోబర్‌లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ప్రదర్శన జరిగిన ఏడాది లోపే ఈ కాన్సెప్ట్ బైక్ రెడ్ డాట్ డిజైన్ అవార్డును గెలుచుకోవడం హోండా డిజైన్ బృందానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చినట్లు అయ్యింది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ బైక్‌ల మాదిరిగా పెట్రోల్ మోటార్‌ సైకిల్ డిజైన్‌కు బ్యాటరీ, మోటార్ జోడించిన కాన్సెప్ట్ కాదు. 2030 తర్వాత మోటార్‌ సైకిళ్ల డిజైన్ ఎలా ఉండొచ్చనే ఆలోచనతో హోండా దీనిని రూపొందించింది.

వీల్స్ లోనే మోటార్లు

Advertisement

ఈ బైక్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ముందు, వెనుక చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చడం. దీనిని ఇన్ వీల్ మోటార్ టెక్నాలజీ అంటారు. సాధారణంగా పెట్రోల్ బైక్‌ లలో ఇంజిన్, గేర్‌బాక్స్, చైన్, ఇతర పవర్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు ఉంటాయి. కానీ, ఈ కాన్సెప్ట్‌ లో వాటి అవసరాన్ని తగ్గించే విధంగా కొత్త లేఅవుట్‌ను ఉపయోగించారు. దీంతో డిజైనర్లకు బైక్ రూపకల్పనలో మరింత ఫ్రీడమ్ లభించింది. ఫలితంగా ఈవీ అవుట్‌ లియర్ చాలా తక్కువ ఎత్తులో, విభిన్నమైన ఆకృతితో రూపొందింది. బైక్‌పై కూర్చునే విధానం కూడా సాధారణ మోటార్‌ సైకిళ్ల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.

తక్కువ ఎత్తులో కూర్చునేలా..

ఈవీ అవుట్‌ లియర్ లో రైడర్ చాలా తక్కువ ఎత్తులో కూర్చునేలా డిజైన్ చేశారు. ఈ పొజిషన్ వల్ల ముందున్న రోడ్డును మరింత క్లియర్ గా చూసే అవకాశం ఉంటుందని.. వేగం పెరిగే సమయంలో వచ్చే విండ్ ను క్రేజీగా ఫీలయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది.

సైన్స్ ఫిక్షన్ సినిమాను గుర్తుచేసే డిజైన్

Advertisement

ఈవీ అవుట్‌ లియర్  లుక్ చూస్తే ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో వచ్చే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని వెహికల్స్ గుర్తుకు రావచ్చు. దీని బాడీవర్క్ చాలా మృదువైన ఆకృతితో ఉంది. మరోవైపు, లోపల ఉన్న కొన్ని యాంత్రిక భాగాలు కనిపించేలా స్మోక్డ్ క్లియర్ నిర్మాణాన్ని ఉపయోగించారు. దీంతో బైక్‌కు ఒక ప్రత్యేకమైన, హైటెక్ లుక్ వచ్చింది. ఈవీ అవుట్‌ లియర్ లో కనిపిస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో ఉత్పత్తి మోడల్‌లోకి వస్తాయా? లేదా? అనేది ఇప్పటికీ స్పష్టంగా లేదు. ఎందుకంటే ఇది ప్రస్తుతం కేవలం కాన్సెప్ట్ బైక్ మాత్రమే. అయితే, 2030 తర్వాత హోండా చేస్తున్న ప్రయోగాలకు ఇదో మోడల్ కావచ్చని అంతా భావిస్తున్నారు.

Read Also: పెట్రోల్ స్కూటర్లకు షాక్.. అమ్మకాల్లో ఈవీ స్కూటర్ల జోరు, నంబర్ వన్ ఏదంటే?

Tags

Related News

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

Big Stories

Advertisement
×