E-Paper
Advertisement

Train Ticket: 45 పైసలకు రూ.10 లక్షలు.. ఆరేళ్ల తర్వాత ఆ కుటుంబానికి ఊహించని ఆసరా, మీరు మిస్ కావద్దు!

Train Ticket: 45 పైసలకు రూ.10 లక్షలు.. ఆరేళ్ల తర్వాత ఆ కుటుంబానికి ఊహించని ఆసరా, మీరు మిస్ కావద్దు!
Advertisement

భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రయాణ సమయంలో ఏదైనా జరగకూడని ఘటన జరిగితే ప్రయాణీకుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను అమలు చేస్తుంది. అదీ కేవలం 45 పైసలకే ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఓ వ్యక్తి రైల్వే ప్రయాణ సమయంలో చేసుకున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ తన కుటుంబానికి ఎలా ఉపయోగపడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

2020లో మధ్యప్రదేశ్ లో ఏం జరిగిందంటే?   

ఈ ఘటన 2020 నాటిది. అక్టోబర్ 19న, మధ్యప్రదేశ్‌ లోని మోరెనా నివాసి అయిన రవి కుమార్ శర్మ, భోపాల్ ఎక్స్‌ ప్రెస్‌ లో మోరెనా నుంచి నిజాముద్దీన్‌ కు ఆన్‌ లైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రవి ఢిల్లీకి వెళ్లేందుకు ఈ టికెట్ ను కొనుగోలు చేశాడు. అతడికి D-1 కోచ్‌ లో సీటు కేటాయించబడింది. టికెట్‌ తో పాటు, అతడు 45 పైసలతో ట్రావెల్ ఇన్సూరెన్స్ ను తీసుకున్నాడు. అక్టోబర్ 21, 2020  తెల్లవారుజామున 3:30 గంటలకు,  మోరెనా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. భారీ వర్షం పడుతోంది. అకస్మాత్తుగా పవర్ ప్రాబ్లం ఏర్పడింది. ప్లాట్‌ ఫారమ్‌ పై కోచ్ నంబర్‌లను చూపించే డిస్‌ప్లే బోర్డు కూడా పని చేయడం మానేసింది. తను ఎక్కాల్సిన కోచ్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాలేదు. రైలు వచ్చినప్పుడు, D-1 కోచ్ గేట్ క్లోజ్ అయ్యింది. అతడు లోపల ఉన్న ప్రయాణికులను డోర్ ఓపెన్ చేయాలని కోరాడు. డోర్ ఓపెన్ చేస్తుండగానే, రైలు ముందుకు కదిలింది. అతడు ఫుట్‌ బోర్డ్‌ పైకి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా, అతని కాలు జారి ప్లాట్‌ ఫారమ్‌పై పడిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ. వైద్యులు అతడు మరణించినట్లు ప్రకటించారు.

ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వెళ్లిన శర్మ భార్య

Advertisement

ఈ సంఘటన తర్వాత, రవి కుమార్ శర్మ భార్య మనీషా ట్రావెల్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేయడానికి IRCTC ఆఫీస్ కు వెళ్లింది. ఆ కుటుంబం ఆగస్టు 2021లో బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు దాఖలు చేసింది. వారు టికెట్, నామినీ పత్రాలు, బుకింగ్ వివరాలతో సహా అవసరమైన అన్ని పత్రాలను సమర్పించారు. కానీ బీమా కంపెనీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా కేసు ఆలస్యం అవుతూనే ఉంది. చివరికి, కుటుంబం భోపాల్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.

వినియోగదారుల ఫోరం కీలక తీర్పు

దాదాపు ఆరు సంవత్సరాల తరువాత, వినియోగదారుల ఫోర్ శర్మ కుటుంబానికి అనుకూలంగా తీర్పు ప్రకటించింది. వినియోగదారుల కమిషన్ బీమా కంపెనీని లిఖితపూర్వక ఫిర్యాదు తేదీ నుంచి 7 శాతం వార్షిక వడ్డీతో పాటు రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అదనంగా, రూ.10,000,  చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 5,000 చెల్లించాలని ఆదేశించింది. నిర్ణీత సమయంలో చెల్లింపు చేయకపోతే, 9 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని ఆ ఉత్తర్వులో వెల్లడించింది.

Advertisement

భోపాల్ వినియోగదారుల ఫోరం ఈ సంఘటనను ప్రయాణ సమయంలో జరిగిన ప్రమాదంగా పరిగణించి, బీమా క్లెయిమ్ చెల్లుబాటు అవుతుందని తీర్పు ఇచ్చింది. రవి కుమార్ శర్మ దగ్గర చెల్లుబాటు అయ్యే రైల్వే టికెట్, ప్రయాణ బీమాతో సహా అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయి. IRCTC పాత్ర టికెట్ బుకింగ్‌కు మాత్రమే పరిమితం అని, బీమా కంపెనీ క్లెయిమ్‌లను పరిష్కరించే బాధ్యత ఉందని కూడా స్పష్టం చేయబడింది. బీమా క్లెయిమ్‌ను 15 రోజుల్లోపు చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

Read Also: కూర్చున్న చోటుకే ఆహారం.. రైల్వే సరికొత్త సదుపాయం, ఇలా చేస్తే చాలు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×