భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. రకరకాల కారణాలతో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు అందించే స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.1 లక్షలోపు ధరతో, మంచి ఫీచర్లు, ఆకట్టుకునే రేంజ్‌తో లభిస్తున్న ఐదు పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
ఈ లిస్టులో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా VX2. బ్యాటరీ స్వాప్ సబ్ స్క్రిప్షన్ మోడల్ ద్వారా దీని ప్రారంభ ధర కేవలం రూ.44,490 మాత్రమే. ఈ స్కూటర్ టాప్ వేరియంట్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ తో గరిష్టంగా 142 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, వినియోగానికి అనుగుణంగా ఛార్జ్ చెల్లించే సౌకర్యం ఉంటుంది. విద్యార్థులు, రోజూ సిటీలో ప్రయాణించే వారికి బెస్ట్ ఆప్షన్ గా ఉంది.
టీవీఎస్ ఆర్బిటర్ V1 కూడా తక్కువ ధరలో లభించే మరో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర సుమారు రూ.49,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ ముఖ్యంగా సిటీల్లో ఈజీగా ప్రయాణించాలనుకునే యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా టీవీఎస్ పెద్ద సర్వీస్ నెట్ వర్క్ ఉండటం వల్ల అమ్మకాల తర్వాత సర్వీసులు కూడా ఈజీగా అందుబాటులో ఉంటాయి.
టీవీఎస్ ఐక్యూబ్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. బ్యాటరీ సబ్ స్క్రిప్షన్‌తో దీని ప్రారంభ ధర సుమారు రూ.59,999. ఈ స్కూటర్ కుటుంబ అవసరాలకు బాగా సరిపోతుంది. మంచి బిల్డ్ క్వాలిటీ, సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, మంచి పనితీరు కారణంగా చాలా మంది కొనుగోలుదారులు దీనిని ఇష్టపడుతున్నారు.
ఏథర్ రిజ్టా ధర సుమారు రూ.76,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ప్రీమియం ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో నావిగేషన్, పలు రైడింగ్ మోడ్‌లు, పెద్ద సీటు, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. టెక్నాలజీ ఫీచర్లను ఇష్టపడే కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది.
బజాజ్ చేతక్ క్లాసిక్ డిజైన్, మెటల్ బాడీ నిర్మాణంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. దీని ధర సుమారు రూ.91,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ మెరుగైన బ్యాటరీ వేరియంట్ లో 150 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందిస్తుంది. IP67 వాటర్ రెసిస్టెన్స్, బజాజ్ దేశ వ్యాప్త సర్వీస్ నెట్ వర్క్ లాంటి అంశాలు దీన్ని మరింత క్రేజీగా మారుస్తాయి.
Read Also: సింగిల్ ఛార్జ్ తో 129 కి.మీ రేంజ్.. లేటెస్ట్ ఫీచర్లతో మతిపోగొడుతున్న క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!