E-Paper
Advertisement

జూలై 2న కొత్త రెనాల్ట్ క్విడ్ గ్రాండ్ ఎంట్రీ.. డిజైన్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

జూలై 2న కొత్త రెనాల్ట్ క్విడ్ గ్రాండ్ ఎంట్రీ.. డిజైన్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Renault Kwid Facelift India Launch: భారత చిన్న కార్ల మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రెనాల్ట్ క్విడ్ కొత్త అవతార్‌ లో రాబోతోంది. అప్‌ డేటెడ్ క్విడ్ ఫేస్‌ లిఫ్ట్‌ ను జూలై 2న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు రెనాల్ట్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ, ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్స్, ఆటో మార్కెట్ సమాచారం ఆధారంగా కొన్ని కీలక మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి.

ఫ్రెష్ లుక్ లో కొత్త రెనాల్ట్ క్విడ్

కొత్త క్విడ్‌ లో ప్రధానంగా డిజైన్ పరమైన మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా కొత్త మోడల్ కాకపోయినా, ప్రస్తుతం అమ్ముడవుతున్న కారుతో పోలిస్తే మరింత ఆకట్టుకునే  రూపాన్ని సంతరించుకోనుంది. రెనాల్ట్ గ్లోబల్ డిజైన్ కు  అనుగుణంగా ఈ హ్యాచ్‌ బ్యాక్‌ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. కారు ముందు భాగంలో కొత్త గ్రిల్, సరికొత్త బంపర్, హెడ్‌ ల్యాంప్ డిజైన్ లాంటి అప్‌ డేట్లు ఉండే అవకాశం ఉంది. అలాగే వెనుక భాగంలో కూడా టెయిల్ ల్యాంప్‌లు, బంపర్ డిజైన్‌ లో చిన్న చిన్న మార్పులు కనిపించే అవకాశం ఉంది. క్విడ్ మరింత లేటెస్ట్ గా కనిపించేలా కంపెనీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఇంటీరియర్, ఫీచర్లలో కీలక మార్పులు

Advertisement

ఇంటీరియర్‌ లో కూడా కొన్ని కొత్త మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అలాగే డ్యాష్‌ బోర్డ్ డిజైన్‌ లో కూడా చిన్నపాటి మార్పులు ఉండొచ్చని సమాచారం. ఫీచర్ల పరంగా ఈ కారు మరింత ఆధునికంగా మారే అవకాశం ఉంది.

ఇంజిన్ లో నో ఛేంజెస్

ఇంజిన్ విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్ మూడు సిలిండర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అలాగే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 65 బీహెచ్‌పీ శక్తిని, 96Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు అనువైన ఈ ఇంజిన్ మంచి మైలేజీని కూడా అందిస్తుంది. ట్రాన్స్‌ మిషన్ ఎంపికల విషయానికి వస్తే, కొనుగోలుదారులకు ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో పాటు ఐదు స్పీడ్ AMT గేర్‌ బాక్స్ ఆప్షన్స్  అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

రెనాల్ట్ భారత మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే కొత్త తరం డస్టర్‌ను పరిచయం చేసిన కంపెనీ, దాని ఏడు సీట్ల వెర్షన్‌ను కూడా త్వరలో తీసుకురానుంది. ఈ నేపథ్యంలో క్విడ్ ఫేస్‌ లిఫ్ట్ విడుదల కూడా కంపెనీ వ్యూహంలో కీలక భాగంగా భావిస్తున్నారు.  క్విడ్ భారత మార్కెట్లో దాదాపు పదేళ్లకు పైగా అమ్మకాలు జరుపుకుంటుంది. తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ఈ కారు వినియోగదారుల ఆదరణ పొందింది. రెనాల్ట్ పోర్ట్‌ ఫోలియోలో ఇది అత్యంత అందుబాటు ధర కలిగిన మోడల్‌గా కొనసాగుతోంది. కొత్త ఫేస్‌ లిఫ్ట్   మారుతి సుజుకి ఆల్టో K10, మారుతి సెలెరియో వంటి కార్లకు పోటీ ఇవ్వనుంది.

Read Also: మార్కెట్ లోకి హీరో ప్యాషన్+ డిస్క్ వేరియంట్ ఎంట్రీ.. ధర ఎంతో తెలుసా?

Related News

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

Big Stories

Advertisement
×