JSW Motors to Launch 15 New Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్లో త్వరలో మరో కొత్త కార్ల బ్రాండ్ అడుగుపెట్టబోతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ పేరుతో ప్యాసింజర్ వాహనాల రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఎంజీ మోటార్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్న ఈ గ్రూప్, ఇప్పుడు సొంతంగా కొత్త బ్రాండ్‌ను తీసుకొస్తోంది. ఈ కంపెనీ రాబోయే నాలుగేళ్లలో మొత్తం 15 కొత్త కార్లను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం అన్ని మోడళ్ల వివరాలను వెల్లడించకపోయినా, అందులోని నాలుగు ప్రధాన వాహనాల గురించి వివరాలు బయటకు వచ్చాయి.
జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ఈ ఏడాది దీపావళి సమయానికి అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కంపెనీ నుంచి తొలి వాహనం న్యూ ఎనర్జీ వెహికల్ కానుంది. ఎలక్ట్రిక్ కారు లేదంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్ కావచ్చు. నవంబర్ 2026లో ఈ వాహనం బుకింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కంపెనీ దాదాపు ప్రతి మూడు నెలలకు ఒక కొత్త మోడల్ ను తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకుపైగా ధరల విభాగాల్లో పలు మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మహారాష్ట్ర సంభాజీనగర్‌లో ఏర్పాటు చేస్తున్న 300 ఎకరాల భారీ ప్లాంట్‌లో ఈ కార్ల తయారీ జరగనుంది. ప్రారంభ దశలో ఈ ప్లాంట్ ఏడాదికి ఐదు లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
భారత్ లో జేఎస్‌డబ్ల్యూ బ్యాడ్జ్ తో రానున్న తొలి ఎస్‌యూవీ జెటూర్ T2 ఆధారంగా ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ SUV బాక్సీ డిజైన్, పెద్ద వీల్ ఆర్చ్ లు, బలమైన రోడ్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది ఐదు, ఏడు సీట్ల ఆప్షన్స్ లో లభిస్తోంది. భారత్ లో మాత్రం ఏడు సీట్ల వెర్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 26.7kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఈ సెటప్ సుమారు 375 bhp శక్తి, 610 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్ లోనే దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నారు.
జేఎస్‌డబ్ల్యూ లైనప్ లోకి రానున్న మరో మోడల్ చెరీ ఐకార్ V23. ఇది రెట్రో డిజైన్, బాక్సీ ఆకృతితో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో 15.4 అంగుళాల టచ్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లులాంటి ఫీచర్లు ఉంటాయి. ప్రపంచ మార్కెట్లో ఇది రెండు బ్యాటరీ ఎంపికల్లో లభిస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 400 నుంచి 510 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది.
ఈ SUV మరింత ప్రీమియం లుక్‌తో రానుంది. డిజైన్ పరంగా ఇది లగ్జరీ ఎస్‌యూవీలను గుర్తు చేస్తుంది. పెద్ద టచ్ స్క్రీన్, పనోరమిక్ సన్ రూఫ్, 540 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 400 నుంచి 460 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది.
జేఎస్‌డబ్ల్యూ లైన ప్‌లో ఫ్లాగ్ షిప్ SUVగా చెరీ టిగ్గో 8 రానుంది. ఇది పెద్ద మూడు వరుసల SUVగా రానుంది. 15.6 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, ప్రీమియం ఆడియో సిస్టమ్, వైర్ లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, 540 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి అనేక ఫీచర్లను అందించనుంది.
Read Also: 2031 నాటికి 15 మోడళ్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!