TVS Ntorq 125 Gets New Colours: యూత్ లో మంచి ఆదరణ పొందిన స్పోర్టీ స్కూటర్ TVS Ntorq 125 కొత్త కలర్స్, సరికొత్త గ్రాఫిక్స్ తో మరింత ఆకర్షణీయంగా మారింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ స్కూటర్ లోని డిస్క్, రేస్ ఎడిషన్ వేరియంట్లకు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. ఇప్పుడు Ntorq 125 మరింత స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. కొత్త రంగులతో వచ్చిన Ntorq 125 డిస్క్ వేరియంట్ ధర రూ.82,500గా ఉండగా, రేస్ ఎడిషన్ ధర రూ.87,950గా నిర్ణయించారు.
Ntorq 125లో అత్యంత అందుబాటు ధర కలిగిన వేరియంట్ డిస్క్ ఎడిషన్. ఈ వేరియంట్ ఇప్పుడు బ్లాక్, వైట్, యాష్ కలర్స్ లో లభిస్తుంది. ఈ కలర్స్ కు తోడు బాడీపై యెల్లో, ఆరెంజ్ కలర్ గ్రాఫిక్స్ ను యాడ్ చేశారు. ఈ కొత్త డిజైన్ స్కూటర్ కు క్రేజీ స్పోర్టీ లుక్ ను తీసుకొచ్చింది.
Ntorq 125 రేస్ ఎడిషన్ ను యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ వేరియంట్ ఇప్పుడు బ్లూ, రెడ్, గ్రీన్ కలర్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ కలర్స్ స్కూటర్‌కు రేసింగ్ స్టైల్ ను మరింతగా పెంచేలా ఉన్నాయి.
కొత్త రంగులతో పాటు ఈ రెండు వేరియంట్లలో కూడా మరో కీలక అప్ డేట్ ను కంపెనీ అందించింది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త నెగటివ్ LCD డిస్ ప్లేను ఇందులో అందించారు. ఈ డిస్ ప్లేను టీవీఎస్ సొంత మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా రైడర్లు కాల్ అలర్ట్స్, మెసేజెస్, ట్రిప్ డేటా లాంటి వివరాలను ఈజీగా చూసే అవకాశం ఉంటుంది. కనెక్టెడ్ టెక్నాలజీని ఇష్టపడే యువతకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
డిజైన్, కలర్ ఆప్షన్లలో మార్పులు చేసినప్పటికీ, స్కూటర్ మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉన్న ఇంజిన్, పనితీరు అలాగే కొనసాగుతున్నాయి. TVS Ntorq 125లో 124.8cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ మంచి పనితీరు, వేగవంతమైన యాక్సిలరేషన్ తో ఆకట్టుకుంటుంది. సిటీ నగర ప్రయాణాలకు, రోజువారీ వినియోగానికి ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది.
స్పోర్టీ డిజైన్, కనెక్టెడ్ ఫీచర్లు, మంచి పనితీరు కారణంగా Ntorq 125 ఇప్పటికే భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్త రంగులు, కొత్త గ్రాఫిక్స్ యాడ్ చేయడంతో ఈ స్కూటర్‌పై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
Read Also: భారత ఈవీ మార్కెట్లో ఏథర్ దూకుడు.. 7 లక్షల సేల్ మార్క్ క్రాస్!