E-Paper
Advertisement

కార్ కవర్ ఏ కలర్ ఉండాలి? ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి?

కార్ కవర్ ఏ కలర్ ఉండాలి? ఎలాంటి మెటీరియల్  తీసుకోవాలి?
Advertisement

Car Cover Buying Guide:  చాలామంది కారు కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్‌ పై శ్రద్ధ పెడతారు. కానీ, ఒక చిన్న తప్పు వల్ల కారు పెయింట్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. దుమ్ము, ఎండ, వర్షం, పక్షుల రెట్టలు, చెట్ల జిగురు లాంటి వాటి నుంచి కారును రక్షించాలంటే మంచి కార్ కవర్ ఉపయోగించడం చాలా అవసరం. అయితే, మార్కెట్లో ఎన్నో రకాల కవర్లు ఉండటంతో ఏది కొనాలో చాలా మందికి సందేహం వస్తుంది. అయితే, ముందుగా మీ కారును ఎక్కువగా ఎక్కడ పార్క్ చేస్తారో నిర్ణయించుకోవాలి. అదే సరైన కార్ కవర్ సెలెక్షన్ లో కీలక పాత్ర పోషిస్తుంది.

కారు బయట పార్క్ చేస్తే..

ఇంటి బయట, రోడ్డు మీద కారు పార్క్ చేసే వారు తప్పనిసరిగా బలమైన అవుట్‌ డోర్ కార్ కవర్‌ ను తీసుకోవాలి. అలాంటి కవర్లు వర్షం, ఎండ, దుమ్ము, పక్షుల రెట్టలు, చెట్ల నుంచి పడే జిగురు లాంటి వాటి నుంచి కారును రక్షిస్తాయి. సాధారణంగా 3 నుంచి 7 పొరలతో తయారైన కవర్లు మంచి ప్రొటెక్షన్ ను ఇస్తాయి. ఇవి నీరు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, ఎండకు పెయింట్ వెలిసిపోకుండా కూడా కాపాడతాయి.

గ్యారేజీలో పార్క్ చేస్తే..

Advertisement

కారు ఎక్కువగా గ్యారేజీలోనే ఉంటే హెవీ వాటర్‌ ప్రూఫ్ కవర్ అవసరం లేదు. అక్కడ దుమ్ము, చిన్న చిన్న గీతలు, తేమ నుంచి రక్షణ ఉంటే సరిపోతుంది. అందుకే తేలికగా ఉండే, గాలి బాగా ప్రసరించే ఇండోర్ కార్ కవర్లను తీసుకోవడం మంచిది.

మెటీరియల్ చాలా ముఖ్యం!

కార్ కవర్ కొనేటప్పుడు అది ఏ మెటీరియల్‌ తో తయారైందో కూడా చూడాలి. మంచి కవర్ లోపల భాగం చాలా మృదువుగా ఉండాలి. కాటన్ ఫ్లానెల్, ఫ్లీస్ లైనింగ్ ఉంటే కారు పెయింట్‌ పై గీతలు పడే ప్రమాదం తగ్గుతుంది. అవుట్‌ డోర్ కవర్లలో PEVA, పాలిథిలిన్ లాంటి వాటర్‌ ప్రూఫ్ మెటీరియల్స్ ఉంటే వర్షం నుంచి మంచి రక్షణ లభిస్తుంది. గ్యారేజీలో ఉంచే కార్లకు శాటిన్, పాలిస్టర్ శాటిన్ కవర్లు మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇవి తేలికగా ఉండటంతో పాటు దుమ్ము పడకుండా కాపాడుతాయి.

కారు కొనే ముందు వీటి కూడా చెక్ చేయండి!  

Advertisement

కవర్‌ లో గాలి ప్రసరణ ఉండటం చాలా అవసరం. వెంటిలేషన్ లేకపోతే తేమ లోపలే ఉండి కారు బాడీపై తుప్పు వచ్చే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ కవర్ కంటే మీ కారు మోడల్‌ కు ప్రత్యేకంగా తయారైన కస్టమ్ ఫిట్ కవర్ తీసుకుంటే మరింత భద్రత ఉంటుంది. గాలికి ఎగరకుండా బిగ్గరగా పట్టుకుని ఉంటుంది. కవర్‌ కు బలమైన బెల్టులు, ఎలాస్టిక్ అంచులు ఉంటే గాలి బలంగా వీచినా ఊడిపోకుండా ఉంటుంది.

Read Also: జస్ట్ 3 నిమిషాల ఛార్జింగ్ తో 250 కి.మీ రేంజ్ ఇచ్చే ఇండియన్ ఈవీ.. ధర జస్ట్ రూ. 4.5 లక్షలే!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×