EV Subsidy Extended in India: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద అందిస్తున్న ఈవీ సబ్సిడీలను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ టూవీలర్స్, త్రీ వీలర్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలగనుంది.
ఎలక్ట్రిక్ టూ-వీలర్లపై సబ్సిడీలు పొందే గడువును ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించారు. అప్పటిలోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఈ సబ్సిడీలను పొందుతాయి. అటు ఈ-రిక్షాలు, ఈ-కార్ట్ లు లాంటి ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు సబ్సిడీ కాలపరిమితిని ఇంకా ఎక్కువగా మార్చి 31, 2028 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు ఈ నిర్ణయం మేలు కలిగించనుంది.
ఈ సబ్సిడీలు కంటిన్యూగా అందుబాటులో ఉండవు. ఈ పథకం నిర్దిష్ట బడ్జెట్ తో అమలు అవుతోంది. అంటే, ప్రభుత్వం కేటాయించిన నిధులు పూర్తయ్యే వరకు లేదంటే, గడువు ముగిసే వరకు మాత్రమే ఈ సబ్సిడీలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఈవీలు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్లు వీలైనంత త్వరగా కొనుగోలు చేయడం వల్ల కేంద్రం అందించే సబ్సిడీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఈవీలపై సబ్సిడీలను పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ ధర కొంత వరకు తగ్గుతుంది. ఇప్పటికీ చాలా మందికి EVలు కొంచెం కాస్ట్ అనిపిస్తాయి. అలాంటి పరిస్థితిలో సబ్సిడీ రూపంలో లభించే డిస్కౌంట్ కొనుగోలును సులభతరం చేస్తుంది. ముఖ్యంగా సిటీల్లో రోజువారీ ప్రయాణాలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలు బెస్ట్ ఆప్షన్ గా మారుతున్నాయి. ప్రభుత్వం కేవలం వాహనాలపై సబ్సిడీలకే పరిమితం కాకుండా, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా దృష్టి పెడుతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కువ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవి భవిష్యత్తులో EVలను ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా మారేందుకు సహాయపడతాయి.
Read Also: 3 నిమిషాల్లో ఆటో స్కూటర్ అవుతుంది, ఇదేం టెక్నాలజీ భయ్యా!
నిజానికి గతంతో పోలిస్తే సబ్సిడీ మొత్తాలను ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తోంది. అంటే, రానున్న రోజుల్లో పూర్తిగా మార్కెట్ ఆధారంగా EVలు అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రారంభ దశలో ప్రజలను ఆకర్షించేందుకు ఇచ్చిన ప్రోత్సాహాలను భారీగా తగ్గించి, తయారీ ఖర్చులు తగ్గించడం, టెక్నాలజీ అభివృద్ధి, వినియోగదారులకు నమ్మకాన్ని మరింత పెంచే దిశగా ఫోకస్ చేస్తుంది. తాజాగా కేంద్రం తీసుకున్నసబ్సిడీ పొడిగింపు EV కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. వెంటనే కొనుగోలు చేస్తే సబ్సిడీలను పొందే అవకాశం ఉంటుంది.
Read Also: అరగంటలో ఛార్జింగ్, 200 కి.మీ రేంజ్.. విన్‌ఫాస్ట్ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV!