E-Paper
Advertisement

India US Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. లగ్జరీ కార్లపై తగ్గిన ట్యాక్స్.. ఆ కార్లకు మినహా!

India US Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. లగ్జరీ కార్లపై తగ్గిన ట్యాక్స్.. ఆ కార్లకు మినహా!
Advertisement

భారత్-అమెరికా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా భారత ఎగుమతుల మీద ట్యాక్సులను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే ఎలక్ట్రిక్ వాహనాలను ట్యాక్స్ తగ్గించలేదు.   హై ఎండ్ అమెరికన్ ఆటోమొబైల్స్‌ పై సుంకాలను గణనీయంగా తగ్గించనున్నట్లు తెలిపింది. తాజాగా ఫ్రేమ్‌ వర్క్ ప్రకారం, భారత్ కు చెందిన ప్రీమియం యుఎస్ కార్లపై సుంకాలను 110% నుంచి 30%కి తగ్గించనుంది. 3,000 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రో వాహనాలకు ఈ సుంకం తగ్గింపులు వర్తించనున్నాయి. 10 సంవత్సరాలలో క్రమంగా దశలవారీగా అమలు చేయబడతాయి. తాజా ట్రేడ్ డీల్ ప్రకారం హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళతో పాటు ఇతర ప్రీమియం బైక్‌లపై సుంకాలను పూర్తిగా తొలగిస్తుంది.

సుంకాల రాయితీ నుంచి టెస్లా మినహాయింపు

టెస్లా కంపెనీని సుంకాల రాయితీల నుంచి స్పష్టంగా మినహాయించింది. ఈ నిర్ణయంతో టెస్లా భారత మార్కెట్లోకి తక్కువ ధరలకు ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కోల్పోయింది. ఈ మినహాయింపు భారత వాహనాలపై అధిక దిగుమతి సుంకాలను పదేపదే, బహిరంగంగా విమర్శించిన టెస్లా CEO ఎలోన్ మస్క్‌ కు ట్రంప్ గట్టి షాకిచ్చినట్లు అయ్యింది.

యూరోపియన్ యూనియన్‌ ఒప్పందంతో పోల్చితే..

Advertisement

అమెరికా వాణిజ్య ఒప్పందం.. యూరోపియన్ యూనియన్‌తో భారత వాణిజ్య ఒప్పందానికి తీవ్రంగా విరుద్ధంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. భారత్ పలు వాహనాలపై సుంకాలను గణనీయంగా తగ్గించింది. అమెరికాతో పోల్చితే 10% వరకు తక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై చివరికి రాయితీలు కూడా ఉన్నాయి.

దేశీయ ఆటో మోబైల్ ఇండస్ట్రీలని కాపాడేందుకు..  

యునైటెడ్ స్టేట్స్, చైనా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్‌ గా భారత్ కొనసాగుతోంది. 70% నుంచి 110% వరకు అధిక దిగుమతి సుంకాల ద్వారా చాలా కాలంగా దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమను రక్షించుకుంది భారత్. ఈ సుంకాల కారణంగా విదేశీ ఆటోమేకర్లు దేశంలోకి వాహనాలను దిగుమతి చేసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. భారత్  ప్రస్తుతం అమెరికా నుంచి చాలా తక్కువ కార్లను దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఆ దేశం హార్లే డేవిడ్సన్‌ లాంటి హై ఎండ్ మోటార్‌ సైకిళ్లను తీసుకువస్తుంది. ఈ ప్రీమియం బైక్‌లపై సుంకాలను తొలగించడం వల్ల అమెరికన్ తయారీదారులకు మరింత మేలు కలగనుంది.

విస్తృత స్థాయి వాణిజ్య ఒప్పందం

Advertisement

మరికొద్ది రోజుల్లో భారత్- అమెరికా మధ్య  కీలక వాణిజ్య ఒప్పందం జరగనుంది. రష్యా చమురు కొనుగోళ్లను న్యూఢిల్లీ నిలిపివేయడానికి బదులుగా, అమెరికాకు భారత ఎగుమతులపై సుంకాలను 50% నుండి 18%కి తగ్గిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. మార్చిలో జరగనున్న అధికారిక ఒప్పందంపై రెండు దేశాలు సంతకం చేసిన తర్వాత సుంకాల కోతలు అమలు కానున్నాయి. ఈ ఒప్పందం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కీలక ముందడుగు కానుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను మినహాయించడం వివాదాస్పద అంశంగా మారే  అకాశం ఉంది.

Read Also: రెనాల్ట్ డస్టర్ To కియా సోరెంటో.. 2026లో లాంచ్ కానున్న క్రేజీ హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×