E-Paper
Advertisement

Jeep New SUV 2027: జీప్ నుంచి కొత్త SUV.. ఎప్పుడు లాంచ్ అవుతుందంటే

Jeep New SUV 2027: జీప్ నుంచి కొత్త SUV.. ఎప్పుడు లాంచ్ అవుతుందంటే
Advertisement

Jeep New SUV To Launch In 2027: జీప్ ఇండియా తన లైనప్‌ మరింత అప్ డేట్ చేయాలని భావిస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన కార్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా 2.0 స్ట్రాటజీని ప్రకటించింది. ఈ రోడ్‌ మ్యాప్‌ లో భాగంగా, జీప్ బ్రాండ్ 2027లో పూర్తిగా కొత్త SUVని లాంచ్ చేయబోతోంది. ఐదు సంవత్సరాలలో తొలిసారి పూర్తిగా కొత్త మోడల్ ను మార్కెట్ కు పరిచయం చేస్తుంది. అదే సమయంలో దాని ప్రస్తుత మోడల్ కు సంబంధించి ప్రత్యేక ఎడిషన్‌లను విడుదల చేయనుంది.

జీప్ 2.0 ప్లాన్ గురించి..   

జీప్ కొత్త స్ట్రాటజీలో భాగంగా.. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ఫెసిలిటీ లో తయారు చేసిన కార్లను జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తో పాటు ఆఫ్రికా, నార్త్ అమెరికా ప్రాంతాల మార్కెట్లకు ఎగుమతి చేయాలని భావిస్తోంది. నిజానికి, ఉత్తర అమెరికా బయట జీప్ కంపెనీ రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లకు తయారు చేసి ఎగుమతి చేసే మొదటి భారత్ కానుంది.  ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, కంపెనీ ప్రస్తుతం 70 శాతం వరకు ఉన్న స్థానిక వనరులను ఉపయోగించుకుంటుండగా, ఇకపై 90 శాతానికి పెంచాలని భావిస్తోంది. అటు ప్రీ మెయింటెనెన్స్, అదనపు వారంటీ,    కస్టమర్ కేర్ ప్రోగ్రామ్‌ల ద్వారా మరిన్ని అమ్మకాలను కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం జీప్ కంపాస్, మెరిడియన్, రాంగ్లర్ ఆఫ్ రోడర్, ఫ్లాగ్‌ షిప్ గ్రాండ్ చెరోకీని ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉంచింది.

జీప్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి సీఈవో ఏమన్నారంటే?

Advertisement

జీప్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి  స్టెల్లాంటిస్ ఇండియా CEO, MD శైలేష్ హజెలా కీలక విషయాలు వెల్లడించారు. జీప్ 85 సంవత్సరాల వారసత్వం అనేది తమ ప్రామాణికత, సాహసం మీద నిర్మించబడిందన్నారు. జీప్ 2.0 ప్లాన్ లో భాగంగా తమ  ఉత్పత్తి వ్యూహాన్ని మరింత పెంచబోతున్నట్లు తెలిపారు. అదే సమయంలో కస్టమర్ అనుభవాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో స్థానికీకరణ, ప్రపంచ స్థాయి ఉత్పత్తి దృష్టిలో పెట్టుకుని తమ వాహనాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు.

Read Also:  హ్యుండాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు.. దీనికి బ్రేకులు ఉండవు తెలుసా?

కస్లమర్లకు మెరుగైన సేవలు అందించేలా..

Advertisement

ప్రస్తుతం జీప్ బ్రాండ్ తన కస్టమర్లను జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టినట్లు శైలేష్ తెలిపారు. జీప్ కంపెనీ నుంచి వారు ఆశించే సపోర్ట్, సర్వీస్, నమ్మకానికి అనుగుణంగా పని చేస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలికంగా కంపెనీ అభివృద్ది లక్ష్యంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జీప్ బ్రాండ్ కు మరింత ఆదరణ దక్కించుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  గత కొద్ది కాలంగా మార్కెట్ లో జీప్ సంస్థ అంతగా రాణించలేకపోతుంది. అందుకే, కస్టమర్ సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, మళ్లీ తమ బ్రాండ్ ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Also:  MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×